గుడ్‌న్యూస్ చెప్పిన నాగచైతన్య - శోభిత.. పెళ్లయిన 4 నెలలకే!

సమంతతో విడాకుల తర్వాత మరో హీరోయిన్ శోభిత ధూళిపాళను పెళ్లాడారు నాగ చైతన్య. ప్రస్తుతం వీరిద్దరూ హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. మొన్నామధ్య ఫారిన్ వెళ్లిన ఈ జంట ఇండియా తిరిగొచ్చారు. తర్వాత శోభిత ఒంటరిగా తీర్ధయాత్రలకు బయల్దేరారు. తమిళనాడులోని పురాతన ఆలయాలను సందర్శిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా నాగచైతన్య - శోభితలు ఓ శుభవార్త చెప్పారు. ఈ వివరాల్లోకి వెళితే..

తండేల్ బ్లాక్ బస్టర్ కావడంతో మంచి సక్సెస్ జోష్‌లో ఉన్నారు చైతూ. పెళ్లయిన తర్వాత శోభిత వచ్చిన వేళా విశేషమంటూ అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. నాగార్జున కూడా కొడుకు సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత సక్సెస్ మీట్‌కు వచ్చానంటూ తండేల్ ఈవెంట్‌లో నాగ్ భావోద్వేగానికి గురయ్యారు. అంతగా తండేల్ చిత్రం అక్కినేని కుటుంబంలో పండగను తీసుకొచ్చింది. దీనిని ఇలాగే కంటిన్యూ చేయాలని చైతూ భావిస్తున్నారు.

akkineni naga chaitanya sobhita dhulipala launches new business

తండేల్ తర్వాత నాగచైతన్య ఏ సినిమాలో నటిస్తున్నారు? ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు? అంటూ నెటిజన్లు విపరీతంగా చర్చించుకున్నారు. దీనికి చెక్ పెడుతూ అక్కినేని కాంపౌండ్ క్లారిటీ ఇచ్చింది. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నాగచైతన్య ఓ సినిమాలో నటించనున్నారు. దీనికి క్రియేటివ్ జీనియస్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మిస్టరీ హార్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్నాయి.

ఇక చాలా మంది సినీతారలు సినిమాలతో పాటు వ్యాపారాలలోనూ సక్సెస్ కొడుతూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక టాలీవుడ్‌తో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రిలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్‌లలో ఒకరు అనిపించుకున్నారు నాగార్జున. అన్నపూర్ణ స్టూడియోస్, ఎన్ కన్వెన్షన్‌తో పాటు నాగార్జునకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. అలాగే మరిన్ని సంస్థలలోనూ ఆయన పెట్టుబడులు పెట్టారు. ఆయనను ప్రేరణగా తీసుకుని ఎంతో మంది నటులు వ్యాపారాలు చేస్తున్నారు.

అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల నుంచి ఆస్తులు, వారసత్వంతో పాటు వ్యాపార లక్షణాలు కూడా చైతూ పుణికి పుచ్చుకున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులతో పాటు తను సినిమాలు, వాణిజ్య ప్రకటనల ద్వారా వ్యక్తిగతంగా దాదాపు రూ.200 కోట్ల వరకు నాగచైతన్య ఆస్తుల్ని కూడబెట్టారని ఫిలింనగర్ టాక్. ఇక తండ్రి బాటలోనే తాను కూడా బిజినెస్‌మెన్ కావాలని అనుకున్నారు నాగ చైతన్య. ఇప్పటికే ఆయన పలు వ్యాపారాలు చేస్తుండగా తాజాగా శోభితతో కలిసి కొత్త వ్యాపారం మొదలుపెట్టారు చైతూ.

స్కుజి పేరుతో తాము కొత్తగా ఫుడ్ బిజినెస్ ప్రారంభించినట్లుగా నాగచైతన్య, శోభితలు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రుచులను పరిచయం చేయడానికి షోయుని పరిచయం చేస్తున్నట్లు చైతూ తెలిపారు. మీ ప్రేమ, ఆదరణ మాపై ఉండాలని నాగచైతన్య సుదీర్ఘంగా పోస్ట్ పెట్టారు. అలాగే కిచెన్‌ను, అక్కడ తయారవుతున్న వెరైటీల ఫోటోలను కూడా చైతూ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా సినీ ప్రముఖులు, అక్కినేని అభిమానులు చైతూ- శోభితలకు విషెస్ తెలియజేస్తున్నారు. కొందరైతే పెళ్లై 4 నెలలు కూడా కాలేదు.. అప్పుడే భార్యాభర్తలిద్దరూ వ్యాపారం మొదలుపెట్టేశారంటూ షాక్ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X