నాగచైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డ్ లీక్ .. చైతూ తల్లిదండ్రుల ప్లేస్‌లో వాళ్ల పేర్లు

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున కుమారుడు నాగచౌతన్య కొద్దిరోజుల క్రితం తన సహ నటి శోభితా ధూళిపాళతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని మీడియాలో వార్తలు రాగా.. చివరికి వాటిని నిజం చేస్తూ వీరిద్దరూ నిశ్చితార్ధం చేసుకోవడంతో ఇండస్ట్రీ షాక్ అయ్యింది. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి ఎప్పుడు? ఎక్కడ జరుగుతుంది? గెస్ట్‌లు ఎవరు? అనేది హాట్ టాపిక్ మారింది.

సమంతతో విడాకుల తర్వాత ఒంటరిగా జీవితం నెట్టుకొస్తున్న తమ హీరో ఓ ఇంటి వాడు కావడంతో అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పెళ్లికి సంబంధించి రెండు కుటుంబాలు చాలా గుట్టుగా ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం శోభిత ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. పట్టు చీరలో ముస్తాబైన శోభితా పసుపు కొమ్ములను తీసుకొచ్చిన ఆమె తన బంధు మిత్రులతో కలిసి స్వయంగా పసుపు దంచారు.

akkineni naga chaitanya sobhita Dhulipala s wedding card goes viral in social media

ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు, పెద్దల ఆశీర్వాదం తీసుకొంటూ శోభిత కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దాంతో త్వరలోనే నాగచైతన్య, శోభితలు త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారని ప్రచారం జరిగింది.

ఇక ఈ ఏడాదికి గాను ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్‌ను మెగాస్టార్ చిరంజీవికి ప్రకటించారు. ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తనకు కాబోయే కోడలు శోభితను చిరంజీవి, అమితాబ్ తదితరులకు పరిచయం చేశారు నాగార్జున. అలాగే అక్కినేని ఫ్యామిలీ మొత్తం దిగిన గ్రూప్ ఫోటోలోనూ శోభిత ఫోజులిచ్చారు.

ఇక కాబోయే అల్లుడికి శోభిత తల్లిదండ్రులు భారీగా కానుకలు ఇవ్వబోతున్నారని మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఒక ఆడీ కారుతో పాటు స్పోర్ట్స్ బైక్, హైదరాబాద్‌లో ఓ లగ్జరీ విల్లాను చైతన్యకు బహుకరించనున్నారని న్యూస్ వచ్చింది. ఇక డిసెంబర్ 4న నాగచైతన్య - శోభితల పెళ్లి జరగనుందని ఓ న్యూస్ బయటికొచ్చింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలోని ఫేమస్ స్పాట్‌లలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని అనుకున్నా చివరికి హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలోనే వీరి పెళ్లి జరగబోతోందని వార్తలు వస్తున్నాయి.

ఈసారి ఏకంగా చైతూ - శోభితల వెడ్డింగ్ కార్డ్ ఇదేనంటూ మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఇందులో డిసెంబర్ 2వ తేదీన సంగీత్, మూడో తేదీన మెహందీ, నాలుగో తేదీన పెళ్లి జరగనున్నట్లుగా ప్రస్తావించారు. అలాగే పదో తేదీన హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసినట్లుగా ఫిలింనగర్ టాక్. ఈ ఇన్విటేషన్‌లో వధూవరుల తల్లిదండ్రుల పేర్లతో పాటు వారి అమ్మమ్మ , నాయనమ్మ , తాతయ్యల పేర్లను రాశారు.

నాగచైతన్య తల్లిదండ్రుల స్థానంలో అక్కినేని నాగార్జున - అమల పేర్లతో పాటు చైతూ తల్లి దగ్గుబాటి లక్ష్మీ, ఆమె రెండవ భర్త విజయ రాఘవన్ పేర్లను ప్రస్తావించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు - అన్నపూర్ణ, రామానాయుడు - రాజేశ్వరి దంపతుల పేర్లను ముద్రించారు. వెడ్డింగ్ కార్డ్‌తో పాటు కానుకలతో నిండిన ఓ బాక్స్‌ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X