Agent: అఖిల్ చాలా ఇబ్బంది పెట్టేవాడు.. డాక్టర్‌కు చూపించాం.. నాగార్జున కామెంట్స్

సిసింద్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు హ్యాండ్సమ్ హీరో అక్కినేని అఖిల్. వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన అఖిల్ సినిమాతో హీరోగా డెబ్యూ చేసినా అతనికి అనుకున్నంతగా విజయం వరించలేదు. తర్వాత వరుస సినిమాలు చేసిన పెద్దగా సక్సెస్ కాలేదు. 2021లో వచ్చిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ చిత్రంతో కాస్తా హిట్ ట్రాక్ లో పడ్డాడు అఖిల్. ఇప్పుడు సాలిడ్ హిట్ కోసం ఏజెంట్ (Agent) గా బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున యంగ్ హీరో అఖిల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

రెండేళ్ల తర్వాత:అక్కినేని అఖిల్ చివరిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే నమోదు చేసుకుంది. ఇప్పుడు రెండేళ్ల తర్వాత అఖిల్ నటించిన సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించారు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ సంగీతం అందించాడు.

Akkineni Nagarjuna About Akhil Childhood In Agent Pre Release Event

172 ఫీట్ల భవనం:ఏజెంట్ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించగా.. అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఏజెంట్ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలు పెట్టేసి జోరుగా నిర్వహిస్తున్నారు. 172 ఫీట్ల భవనం పైనుంచి దూకి ట్రైలర్ లాంచ్ పోస్టర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నాడు అఖిల్.

సినిమాలన్నీ హిట్టే:తాజాగా ఏజెంట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (Agent Pre Release Event)ను వరంగల్ లోని రంగలీల మైదానంలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక వరంగల్ లో ఈవెంట్ కు సహకరించిన మంత్రి ఎర్రబెల్లికి థ్యాంక్స్ చెప్పారు నాగార్జున. వరంగల్ లో ఫంక్షన్స్ జరుపుకున్న సినిమాలన్నీ హిట్ అయ్యాయని, లేదంటే ఫెయిల్ అవుతాయని మంత్రి బదులిచ్చారు.

Akkineni Nagarjuna About Akhil Childhood In Agent Pre Release Event

తల్లి చనిపోయినా కూడా:మంత్రి ఎర్రబెల్లి మాటలకు 'అయితే మేము వరంగల్ కు వచ్చాం కాబట్టి ఏజెంట్ హిట్టే' అని నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమా కథ వినగానే ఒప్పుకున్న మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి థ్యాంక్స్ చెప్పారు నాగ్. ఆయన ఒప్పుకున్నారంటే సినిమా హిట్ అని అన్నారు. రీసెంట్ గా వాళ్ల అమ్మ ఫాతిమా చనిపోయినా కూడా సినిమా రిలీజ్ కు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదని డబ్బింగ్ పూర్తి చేశారని నాగార్జున తెలిపారు.

పడుకోకుండా పరుగెత్తుతూ:ఇక అఖిల్ గురించి నాగార్జున మాట్లాడుతూ.. "అఖిల్ కడుపులో ఉన్నప్పుడు వాళ్ల అమ్మను చాలా ఇబ్బంది పెట్టేవాడు. తనకు 8 నెలల వయసులోనే విపరీతైమైన ఎనర్జీ ఉండేది. నేను అలాంటి పిల్లల్ని ఎప్పుడూ చూడలేదు. పడుకోకుండా ఎప్పుడూ పరుగెత్తుతూ ఉండేవాడు. అఖిల్ ఎనర్జీ చూసి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే తనను సాయిల్ మీద పడుకోబెట్టమని సలహా ఇచ్చారు" అని తెలిపారు.

Akkineni Nagarjuna About Akhil Childhood In Agent Pre Release Event

మా వల్ల అయ్యేది కాదు:"అలా సాయిల్ పై పడుకోబెట్టి తనలోని ఎనర్జీని బయటకు లాగాలని డాక్టర్ సూచించారు. ఈ సినిమాలో కూడా అఖిల్ ఎనర్జీని డైరెక్టర్ సురేందర్ రెడ్డి బయటకు తీశారు. మా యంగ్ ఏజ్ లో ఇలాంటి సిక్స్ ప్యాక్ లు అవన్నీ లేవు. అందుకు నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. లేదంటే అంత కష్టం మా వల్ల అయ్యేది కాదు" అని టాలీవుడ్ మన్మథుడు, నాగార్జున కుమారుడు అఖిల్ గురించి చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X