అమలకు దూరంగా నాగార్జున అక్కినేని.. వారిద్దరి మధ్య చిచ్చు పెట్టిన విషయం ఏంటో తెలుసా?
టాలీవుడ్ లో ఉన్న ఆదర్శనీయమైన సెలబ్రిటీ కపుల్స్ లో అక్కినేని నాగార్జున, అమల దంపతులు కూడా ఒకరు. అయితే భార్య భర్తల మధ్య అప్పుడప్పుడు అలకలుఎం గొడవలు రావడం సర్వసాధారణమే. వాటికీ సెలెబ్రిటీ కపుల్ ఏమీ మినహాయింపు కాదు. ఒకానొక సందర్భంలో నాగార్జున కూడా అమలతో దాదాపు నెల రోజులు మాట్లాడడం మానేశారట. అది కూడా ఒక కుక్క కారణంగా. మరి ఇంతకీ వీళ్లిద్దరి మధ్య గొడవ రావడానికి ఆ కుక్క ఎలా కారణమైంది అని ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అక్కినేని అమల కెరీర్ పీక్స్ లో ఉండగానే టాలీవుడ్ మన్మథుడు నాగార్జునను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు హీరోయిన్ గా పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన అమల పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత బ్లూ క్రాస్ అనే జంతు సంరక్షణ సంస్థతో కలిసి పని చేస్తుంది అమల. అయితే చాలా రోజుల క్రితం ఆ కుక్కల కారణంగానే అమలకు నాగార్జునకు మధ్య గొడవ వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో అమల చెప్పుకొచ్చింది.

అఖిల్ అక్కినేని చిన్నగా ఉన్నప్పుడు ఆయన కోసం ఒక కుక్కని కొనుక్కొచ్చారట. అప్పటి వరకు ఇంట్లో అన్నీ ఇండియన్ డాగ్స్ ఉండగా, అదొక్కటి మాత్రం లాబ్రడార్ జాతికి చెందిన కుక్క అని గుర్తు చేసుకుంది. అయితే అప్పట్లో ఇంటికి ఎవరొచ్చినా ఆ కుక్క వాళ్ళ మీదకి ఎగబడి పోయేదని, దాన్ని చూసి అందరూ తెగ భయపడి పోయే వారని గుర్తు చేసుకుంది అమల.
దీంతో ఆ డాగ్ ని కంట్రోల్ చేయడానికి అమల షాకింగ్ నిర్ణయం తీసుకుందట. ఏకంగా నెల రోజులపాటు ఆ లాబ్రడార్ కుక్కని ట్రైనింగ్ కోసం పంపించేసిందట. అయితే అదే రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన నాగార్జునకు ఆ కుక్క కనిపించలేదట. దీంతో ఏమైందని అడగ్గా, దాన్ని ట్రైనింగ్ కు పంపించానని చెప్పిందట.
ఇంకేముంది ఇంటికి రాగానే తనకోసం ఎంతో, ఇష్టంగా ఎదురు చూసే కుక్కని తనకి తెలియకుండా ట్రైనింగ్ కి పంపించిందని కోపంతో నాగార్జున అమలతో మాట్లాడడం మానేసాడట. ఆయనకు ఆ కుక్క అంటే చాలా ఇష్టం ఉండేదట. నాగార్జున ఇంటికి రాగానే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయనను ఇంట్లోకి తీసుకొచ్చేదట.
రోజంతా షూటింగ్ లతో బిజీ బిజీగా గడిపిన ఆయనకు ఇంటికి రాగానే తనకు ఇష్టమైన ఆ కుక్కను చూడగానే హ్యాపీగా ఉండేదట. ఇక ఆ కుక్క ట్రైనింగ్ అయిపోయి ఇంటికి వచ్చే వరకు నాగ్ అమలతో ఒక్క మాట కూడా మాట్లాడలేదట. ఈ ఫన్నీ ఇన్సిడెంట్ ని అమల ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది. మొత్తానికి ఈ ఆదర్శ దంపతుల మధ్య ఒక కుక్క కారణంగా ఫన్నీ గొడవ జరిగిందన్న మాట. కాగా నాగార్జున ఈ ఏడాది సంక్రాంతికి నా సామి రంగ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











