For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bangarraju: బిగ్ బాస్ మొదలైన వెంటనే ఆ రాష్ట్రానికి నాగార్జున.. నాగ చైతన్యతో కలిసి సందడి

  |

  చాలా కాలంగా హిట్‌ను అందుకోలేక తెగ ఇబ్బందులు పడుతున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున. సుమారు నాలుగైదేళ్లుగా ఎన్నో చిత్రాల్లో నటించిన ఆయనకు.. సక్సెస్ మాత్రం అందనంత దూరంలోనే ఉంటోంది. అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ, విజయం కోసం ఇంకా ఇంకా నిరీక్షించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది ఆరంభంలో 'వైల్డ్ డాగ్' అనే సినిమా చేయగా.. ఇది మంచి టాక్‌ను అందుకున్నా, కలెక్షన్లను మాత్రం అంతగా రాబట్టలేకపోయింది. దీంతో నిరాశనే మిగిల్చింది.

  Bigg Boss Telugu 5 Nominations: ఈ వారం ఎలిమినేషన్ జోన్‌లో ఆరుగురు.. టైటిల్ ఫేవరెట్‌ కూడా నామినేట్

  వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న అక్కినేని నాగార్జున ప్రస్తుతం.. విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'ఘోస్ట్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన చాలా వరకూ షూటింగ్ పూర్తైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది చిత్రీకరణను జరుపుకుంటూ ఉండగానే అక్కినేని నాగార్జున మరో సినిమాను కూడా పట్టాలెక్కించేశాడు. అదే తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకుంటోన్న 'బంగార్రాజు' మూవీనే.

  Akkineni Nagarjuna and Naga Chaitanya went Mysore for Bangarraju Shooting

  అక్కినేని నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయన'. ఏమాత్రం అంచనాలు లేకుండానే విడుదలైన ఈ మూవీ.. భారీ విజయాన్ని అందుకుంది. అలాగే, కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేసింది. ఫలితంగా నాగార్జున కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందీ ఫిల్మ్. ఇది ఈ రేంజ్‌లో హిట్ అవడంతో దీనికి ప్రీక్వెల్ తీయాలని అప్పుడే అనుకున్నారు. ఇందులో భాగంగానే 'బంగార్రాజు' అనే టైటిల్‌తో స్క్రిప్ట్ కూడా రెడీ చేశారు. ఇందులో నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది.

  Bigg Boss Telugu 5: ఆదిలోనే యాంకర్ రవికి షాక్.. అతడికే ఎక్కువ మద్దతు.. లేడీస్‌లో ఆమెకు!

  'బంగార్రాజు' మూవీ షూటింగ్‌ హైదరాబాద్ షెడ్యూల్‌ను మూడు రోజుల క్రితమే పూర్తి చేసేశారు. ఆ వెంటనే అక్కినేని నాగార్జున బిగ్ బాస్ ఐదో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇది పూర్తైన వెంటనే అంటే తాజాగా ఆయన.. తన కుమారుడు అక్కినేని నాగ చైతన్యతో కలిసి కర్నాటకలోని మైసూర్‌ వెళ్లారు. వెంటనే అక్కడ 'బంగార్రాజు' మూవీ షూటింగ్‌ను కూడా మొదలు పెట్టేశారు. దాదాపు 20 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఇందులో చైతూ, నాగ్ మధ్య కాంబో సీన్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.

  Akkineni Nagarjuna and Naga Chaitanya went Mysore for Bangarraju Shooting

  అక్కినేని మల్టీస్టారర్‌గా రాబోతున్న 'బంగార్రాజు' మూవీ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసి వచ్చే జనవరిలో దీన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇందుకు అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జునకు జోడీగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తోంది. అలాగే, నాగ చైతన్యతో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి రొమాన్స్ చేయబోతుంది. ఈ మూవీలో బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ కీలక పాత్రను పోషిస్తోంది. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. అక్కినేని నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటిస్తున్నట్లు కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

  English summary
  Tollywood Senior Hero Akkineni Nagarjuna Doing Bangarraju Movie Under Kalyan Krishna Direction. This Movie Shooting Started From Today.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X