twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ghost: దుబాయ్‌లో ఆ హీరోయిన్‌తో నాగార్జున చిల్.. ఇంటర్నెట్‌లో ఫొటోలు వైరల్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్లే హీరోల్లో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను సొంతం చేసుకున్న ఆయన స్టార్‌డమ్‌ను అందుకున్నాడు. అలా దాదాపు మూడు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ వస్తున్నాడు. అయితే, కొంత కాలంగా నాగార్జున సరైన బ్రేక్ లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. 'సోగ్గాడే చిన్ని నాయన' తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. అయినప్పటికీ దాని తర్వాత రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుస పెట్టి ఎన్నో సినిమాలు చేస్తూనే వస్తున్నాడు.

    ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో అక్కినేని నాగార్జున గత ఏడాది 'బంగార్రాజు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో యువ సామ్రాట్ నాగ చైతన్య కూడా నటించిన విషయం తెలిసిందే. కల్యాణ్ కృష్ణ కురసాల రూపొందించిన ఈ మూవీ సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా చేశారు. దీన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయింది. దీనికి అన్ని వర్గాల నుంచి భారీ స్పందన వచ్చింది. ఫలితంగా కలెక్షన్లు పొటెత్తి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.

    Akkineni Nagarjuna and Sonal Chauhan Chill at Ghost Sets in Dubai

    కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన ప్రవీణ్ సత్తారుతో 'ఘోస్ట్' అనే సినిమా చేస్తున్నాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ కరోనా సెకెండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. దీంతో ఈ సినిమా మొత్తానికి ఆగిపోయినట్లు ప్రచారం జరిగింది. కానీ, కొద్ది రోజుల తర్వాత ఇది పున: ప్రారంభం అయింది. దీంతో ఆ అనుమానాలకు పుల్‌స్టాప్ పెట్టినట్లు అయింది. ఇక, చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు మళ్లీ మొదలైంది. దుబాయ్‌లో దీనికి సంబంధించిన సాంగ్‌తో పాటు కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తోంది మూవీ యూనిట్.

    హీరోయిన్ హాట్ ఫొటోను షేర్ చేసిన వర్మ: ప్రైవేట్ భాగాలను చూపిస్తూ దారుణంగా!హీరోయిన్ హాట్ ఫొటోను షేర్ చేసిన వర్మ: ప్రైవేట్ భాగాలను చూపిస్తూ దారుణంగా!

    'ఘోస్ట్' మూవీ షూటింగ్ ఇప్పుడు దుబాయ్‌లో ప్రధానమైన షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలను చిత్ర యూనిట్ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. అంతేకాదు, అద్భుతమైన లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడించింది. ఇక, తాజాగా వచ్చిన పిక్‌లలో అక్కినేని నాగార్జున స్టైలిష్ గెటప్‌తో కనిపిస్తున్నాడు. ఇక, వీటిలోనే హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా దర్శనమిస్తోంది. హీరోతో కలిసి ఆమె బోట్‌లో చిల్ అవుతోంది. దీంతో ఈ ఫొటోలు అన్నింటికీ భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    Akkineni Nagarjuna and Sonal Chauhan Chill at Ghost Sets in Dubai

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఘోస్ట్' మూవీ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఇందులో అక్కినేని నాగార్జున ఊహించని పాత్రను చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కీలక పాత్రను పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    English summary
    Akkineni Nagarjuna Now Doing An Action Film Under Praveen Sattaru Direction. Nagarjuna and Sonal Chauhan Chill at This Movie Sets in Dubai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X