For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అక్కినేని ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్: ఆ రెండు రోజులూ సర్‌ప్రైజ్‌లే అంటూ ప్రకటించిన నాగార్జున

  |

  చాలా కాలంగా హిట్‌ను అందుకోవడంలో తడబడుతున్నాడు సీనియర్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున. విజయాలు పరాజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలను చేస్తోన్న ఆయనకు వరుసగా పరాజయాలే ఎదురవుతున్నాయి. అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది 'వైల్డ్ డాగ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఆ వెంటనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమాను మొదలు పెట్టారు. ఇది పూర్తి కాకముందే తన డ్రీమ్ ప్రాజెక్టు 'బంగార్రాజు'ను కూడా లైన్‌లో పెట్టేశారు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

  ‘బంగార్రాజు'గా మారిన నాగార్జున

  ‘బంగార్రాజు'గా మారిన నాగార్జున

  అక్కినేని నాగార్జున నటిస్తోన్న చిత్రాల్లో 'బంగార్రాజు' ఒకటి. కల్యాణ్ కృష్ణ రూపొందిస్తోన్న ఈ సినిమా'సోగ్గాడే చిన్ని నాయన'కు ఇది ప్రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఇందులో నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

  లవర్‌తో కలిసున్న ఫొటో లీక్ చేసిన శృతి హాసన్: అతడు అడగ్గానే అంత పని చేసేసిన బ్యూటీ

  ఎప్పుడో అనుకుంటే ఇప్పుడు ఇలా

  ఎప్పుడో అనుకుంటే ఇప్పుడు ఇలా


  చాలా కాలం క్రితమే 'బంగార్రాజు' ప్రాజెక్టు బాధ్యతను కల్యాణ్ కృష్ణకు అప్పగించాడు నాగార్జున. ఈ క్రమంలోనే ఇది అక్కినేని హీరోల మల్టీస్టారర్ మూవీగా వస్తుందన్న టాక్ కూడా వినిపించింది. కానీ, స్క్రిప్ట్ సరిగా లేకపోవడం వల్లో.. మరే ఇతర కారణాల వల్లో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే దీన్ని అధికారికంగా మొదలు పెట్టేశారు.

  ఫుల్ జోష్‌లో... సంక్రాంతి కానుకగా

  ఫుల్ జోష్‌లో... సంక్రాంతి కానుకగా

  'బంగార్రాజు' మూవీ రెగ్యూలర్ షూటింగ్ మొదలైన తర్వాత దీన్ని ఎంతో వేగంగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూళ్లను కూడా కంప్లీట్ చేసుకున్నారు. దీన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని నాగార్జున ప్రకటించారు. అందుకు అనుగుణంగానే వరుసగా షెడ్యూళ్లను పూర్తి చేస్తున్నారు. మరి అప్పటికి కంప్లీట్ అవుతుందో లేదో చూడాలి.

  పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రభాస్ హీరోయిన్: పెళ్లైన ఆరు నెలలకే తల్లిగా ప్రమోషన్

  ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు

  ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు

  'బంగార్రాజు' సినిమాలో అక్కినేని నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. నాగ చైతన్యకు జోడీగా 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి నటిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే, ఇందులో దేవలోకంలో రంభ ఊర్వశి మేనకల పాత్రలు కూడా ఉంటాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంటే మరో ముగ్గురు హీరోయిన్లను సైతం తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

   అక్కినేని ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్

  అక్కినేని ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్

  క్రేజీ సబ్జెక్టుతో అక్కినేని మల్టీస్టారర్‌గా రాబోతున్న 'బంగార్రాజు' మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అదే సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలను సైతం అప్పుడే ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే కృతి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో రెండు ట్రీట్స్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.

  బ్రా కూడా లేకుండా షాకిచ్చిన పాయల్: వెయిట్ చేయలేకపోతున్నా అంటూ పోస్ట్.. వామ్మో ఇది మరీ దారుణం

   ఆ రెండు రోజులూ సర్‌ప్రైజ్‌లే అని

  ఆ రెండు రోజులూ సర్‌ప్రైజ్‌లే అని

  'బంగార్రాజు' మూవీ నుంచి రెండు సర్‌ప్రైజ్‌లు రాబోతున్నాయని అక్కినేని నాగార్జున ప్రకటించారు. ఈ సినిమాలోని బంగార్రాజు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నవంబర్ 22, సాయంత్రం 5:22 గంటలకు విడుదల చేయబోతున్నారు. అలాగే, ఈ మూవీ టీజర్‌ను నవంబర్ 23, ఉదయం 10:23 గంటలకు వదలబోతున్నారు. దీనిపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

  English summary
  Akkineni Nagarjuna Doing Bangarraju Movie Under Kalyan Krishna Direction. Nagarjuna Announce This Movie First Look and Teaser Dates.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X