For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    The devil is back: బంగార్రాజు వచ్చేశాడు.. స్వర్గం నుంచి మెట్లు దిగుతున్న మన్మథుడు

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంత మంది స్టార్ హీరోలు ఉన్నా కూడా వారందరిలో మన్మథుడు ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న ఏకైక హీరో అక్కినేని నాగార్జున. ఆరు పదుల వయసు దాటినా ఇప్పటికి కూడా ఇంకా నవమన్మధుడు లానే నేటి తరం యువకులకు ఒక చాలెంజ్ విసురుతున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ కూడా నాగార్జున ఒకే తరహా ఫిట్నెస్ లో కనిపిస్తూ ఉండడం కూడా మిగతా హీరోలకు మరొక ఛాలెంజ్ అని చెప్పవచ్చు. నేడు నాగార్జున 62 వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా టాలీవుడ్ బడా సెలెబ్రిటీల నుంచి భారీ స్థాయిలో పుట్టినరోజు శుభాకాంక్షలు అందుతున్నాయి.

    నాగార్జున ఎలాంటి సినిమా చేసినా కూడా విభిన్నంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే అక్కినేని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాలలో బంగార్రాజు టాప్ లిస్టులో ఉందని చెప్పవచ్చు. సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న బంగార్రాజు సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక నేడు పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. నాగార్జున స్వర్గం దివి నుంచి దిగి వస్తున్నట్లు ఉన్న ఆ పోస్టర్ అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంటోంది.

    Akkineni nagarjuna bangarraju first look viral in social media

    నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్య సోషల్ మీడియా ద్వారా ఈ పోస్టర్ ను విడుదల చేశాడు. నాగార్జున ఇంకా పాతికేళ్ళ కుర్రాడి తరహాలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక సినిమాకు డెవిల్ ఇస్ బ్యాక్ అనే ట్యాగ్ ఇవ్వడం కూడా సరి కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడం ఖాయమని కూడా అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాగచైతన్య కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. సోగ్గాడే చిన్నినాయన సినిమా లో తండ్రి కొడుకుల కనిపించిన నాగార్జున ఈసారి కూడా అదే తరహాలో చూపిస్తాడని తెలుస్తోంది. ఇక నాగచైతన్య ఎలాంటి పాత్రలో నటిస్తాడు అనేది కొందరిలో మరింత ఆసక్తిని రేపుతోంది.

    ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా అక్కినేని నాగార్జున తన సొంత ప్రొడక్షన్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక మరోవైపు నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు ది ఘోస్ట్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు కూడా భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. చూస్తుంటే నాగార్జున రానున్న రోజుల్లో విభిన్న తరహాలో బాక్సాఫీస్ ను షేక్ చేసే విధంగా ఉన్నాడని అనిపిస్తోంది. ఇక నాగార్జున అయితే గత కొంత కాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే మరి ఈ సినిమాలతో నాగ్ మళ్లీ బాక్సాఫీస్ ట్రాక్ లోకి వస్తాడో లేదో చూడాలి.

    English summary
    Akkineni nagarjuna bangarraju first look viral in social media
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X