మొహం పట్టుకొని అలా అనేసేవాడు.. నాగార్జునపై సుమంత్ కామెంట్స్!
అక్కినేని సుమంత్ టాలీవుడ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు కెరియర్ లో కాస్తా వెనకబడినా ప్రస్తుతం తన అభిమానులకు జోరుగా అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. సినిమాపై సినిమా చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే సుమంత్ తనకు సమయం ఉన్నప్పుడల్లా ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ వస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మామ అక్కినేని నాగార్జున గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..
సుమంత్ హిట్ సినిమాలు..
1999 నుంచి అక్కినేని సుమంత్ తెలుగు సినిమా పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే వస్తున్నారు. తొలుత డాషింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'పేమ కథ' అనే చిత్రంలో నటించి తెలుగు తెరకు హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత యువకుడు, పెళ్లి సంబంధం, రామ్మ చిలకమ్మ, సత్యం, గౌరీ, ధన 51, మహానంది, గోదావరి, చిన్నోడు, మధుమాసం, చిన్నోడు, బోణి, గోల్కొండ హై స్కూల్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. కరోనా తర్వాత మళ్లీ మొదలైంది, సీతా రామం, సార్, అహం రిబూట్ వంటి చిత్రాలతో పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ వచ్చారు. రీసెంట్ గా అనగనగ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అఖిల్ కెరియర్ గురించి సుమంత్ మాట్లాడుతూ...
సుమంత్ రీసెంట్ ఇంటర్వ్యూలో తన కెరియర్ గురించి మాట్లాడారు. తన పెద్ద ఎవ్వరినీ కలవడానికి ఇష్టపడరని, తన ఇంట్లోని హోమ్ థియేటర్ లోనే సినిమాలు చూస్తూ ఎక్కువ సమయం గడుపుతూ ఉంటానని చెప్పారు. మరోవైపు తన సినిమాలకు వందశాతం ఎఫర్ట్ పెట్టి సినిమా చేస్తానని చెప్పారు. ఇదే క్రమంలో అఖిల్ కెరీయర్ గురించి మాట్లడుతూ.. అఖిల్ కెరీయర్ బిగినింగ్ నుంచి స్ట్రాంగ్ హిట్ కోసం కష్టపడుతున్నాడు. మంచి హార్డ్ వర్క్ చేస్తాడు. నెక్ట్స్ లెనిన్ తో తప్పకుండా మంచి సక్సెస్ అందుకుంటాడని నమ్ముతున్నాను.
నా మొహం పట్టుకొని చెప్పేసిన నాగార్జున..
మా కుటుంబంలో అందరికీ తాత అక్కినేని నాగేశ్వర రావునే స్ఫూర్తి. ఆయన మాట అందరూ ఎంతో శ్రద్ధగా వినేవాళ్లు. మా అమ్మ అచ్చం తాతలానే ఉంటుంది.. నేను అచ్చం అమ్మలానే ఉంటాను. అలా ఆయన నుంచే మాకు నటన అబ్బింది. కానీ ఎప్పుడూ ఎవ్వరినీ అనుసరించ వద్దని, ఇమిటేట్ చేయవద్దని చెబుతూ ఉండేవారని సుమంత్ చెప్పారు. ఇక తన కెరీయర్ ప్రారంభంలో నాగార్జున, తన చెల్లి ఎప్పటికప్పుడు తన నటనపై సలహాలు, సూచనలు చేసేవారని చెప్పాడు. తన నటన బాలేకపోతే మాత్రం మొహం మీదే చెప్పేవారని, వెంటనే మార్చుకోమని సూచిస్తూ ఉండేవారని నాగార్జున గురించి చెప్పుకుంటూ వచ్చారు.
సుమంత్ నెక్ట్స్ సినిమాలివే..
రీసెంట్ గా మే 15న అనగనగ అనే చిత్రంతో సుమంత్ వెండితెరపై మెరిశారు. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. మహేంద్రగిరి వారాహి, అనగనగ ఒక రౌడీ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్నాయి


Click it and Unblock the Notifications











