తెలంగాణ సీఎం సహాయనిధికి నాగార్జున మొదటి విరాళం.. ఎంతంటే?

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు వర్షం తీవ్రత ఎక్కువవుతోంది. వరుణుడు కాస్త డోస్ పెంచినా కూడా రోడ్లు, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పటికే కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లగా వేలాది మంది భాగ్యనగర వాసుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. ఈ తరుణంలో మరోసారి ప్రతి ఒక్కరు ఎదుటివారిని ఆదుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సెలబ్రెటీలు పిలుపునిచ్చారు. ఇక నాగార్జున మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.

భారీ వర్షాలు కురవడంతో వరదల వచ్చి హైదరాబాద్ ప్రజల జీవితాన్ని నాశనం చేశాయి. అయితే తక్షణ ఉపశమనం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 550 కోట్లు విడుదల చేయడం నిజంగా అభినందించాల్సిన విషయం. ఇక ఈ సహాయంలో నా వంతు సహాయంగా నిలబడి తెలంగాణ సిఎం సహాయ నిధికి 50 లక్షలు సమకూరుస్తున్నట్లు అక్కినేని నాగార్జున సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. అందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Akkineni nagarjuna contribute the fifty lakhs to ts cm relief fund

తెలంగాణ సిఎంఓ చేస్తున్న కృషికి నాగార్జున ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. ఇక అంతకుముందు నందమూరి బాలకృష్ణ 1కోటి 50లక్షల విరాళం అందించారు. ఇక ఇదే బాటలో మరికొందరు టాలీవుడ్ ప్రముఖులు కూడా సహాయం చేసేందుకు ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అభిమానులు సోషల్ మీడియా ద్వారా వారి అభ్యర్థనలను తెలుపుతున్నారు.

పరిస్థితులను చూసి కొందరు సెలబ్రెటీలు చలించిపోతున్నారు. ఒకవైపు కరోనా మరోవైపు వరదలతో జీవితం చాలా భారంగా మారిందని అంటున్నారు. ఇక సీఎం సహాయ నిధికి మొదట నాగార్జున విరాళమిచ్చి హాట్ టాపిక్ అయ్యేలా చేశారు. మరి ఆయన బాటలో ఎవరెవరు నడుస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X