స్విట్జర్లాండ్ వీధుల్లో నాగార్జున, అమల ఎంజాయ్.. వైరల్ అవుతున్న పిక్
స్విట్జర్లాండ్ అందాలను ఆస్వాదిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు నాగార్జున దంపతులు. టాలీవుడ్ బ్యూటిపుల్ కపుల్ గా పేరుగాంచిన ఈ జోడీని ఇలా చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. భర్త నాగార్జునతో దిగిన పిక్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ''నమస్తే స్విట్జర్లాండ్'' అని ట్యాగ్ చేసింది అక్కినేని అమల. ఈ ఏజ్ లో కూడా నవదంపతుల్లా ఎంతో క్యూట్‌గా కనిపిస్తోంది నాగార్జున, అమల జోడీ. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఇంతకీ నాగార్జున, అమల కలిసి స్విట్జర్లాండ్ ఎందుకు వెళ్లినట్లు అనే కదా మీ సందేహం. అదేనండీ.. మన్మథుడు 2 సినిమా షూటింగ్ ప్రస్తుతం స్విట్జర్లాండ్ లోనే జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం నాగార్జునకు తోడుగా అక్కడికి వెళ్ళింది అక్కినేని అమల. ఈ మేరకు షూటింగ్‌లో పాల్గొంటూనే స్విట్జర్లాండ్ వీధుల్లో ఎంజాయ్ చేస్తోంది నాగార్జున జోడీ. భార్య అమలతో కలిసి స్విస్ అందాలను ఆస్వాదిస్తూ ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నాడు నాగ్. ఇలా ఈ అక్కినేని సీనియర్ జోడీని చూసిన నెటిజన్స్.. నాగ్ ఎవర్ యంగ్ అని, ఆ రోజుల్లో ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా ఈ జోడీ అలాగే ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక నాగార్జున సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ఆఫీసర్ సినిమాతో కాస్త నిరాశ చెందిన నాగార్జున తనలోని మన్మథుడిని మరోసారి బయటకు తీయబోతున్నాడు. యంగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు 2 సినిమా చేస్తున్నారు నాగ్. ఈ చిత్రంలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సమంత, కీర్తి సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే విడుదలైన మన్మథుడు 2 టీజర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











