మెగాస్టార్ ను చూసి నాగార్జున వణికిపోయిన సందర్భం.. ఏఎన్ఆర్ చెప్పడంతో!
మెగాస్టార్ చిరంజీవి - అక్కినేని నాగార్జున మధ్య జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. నాగార్జున కంటే ముందే చిరంజీవి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దుమ్ములేపుతున్న రోజులవి. 'ప్రాణం ఖరీదు' చిత్రంతో మొదలైన చిరంజీవి సినీ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 45 ఏళ్లకు పైగా చిరంజీవి తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. 160కి పైగా సినిమాల్లో నటించి పలు రికార్డులను తనపై సెట్ చేసుకున్నా సంగతిని ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు. ఎంతో మందికి చిరంజీవి జీవితం ఆదర్శకంగా నిలిచింది. మెగాస్టార్ ను స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వారు వేల సంఖ్యలోనే ఉన్నారని చెప్పాలి.
చిరంజీవి ఆరుపదుల వయస్సు దాటినా ఏమాత్రం తగ్గకుండా యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ట్రెండ్ తగ్గట్టుగా తన లుక్ ను మార్చుకుంటూ ఈ తరం ఆడియెన్స్ ను కూడా మెగాస్టార్ చిరంజీవి అలరిస్తున్నారు. తన అభిమానులుగా మార్చుకుంటున్నారు. ఇక మరోవైపు కింగ్, అక్కినేని నాగార్జున తన కెరీర్ ను చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చిన 18 ఏళ్లకు ప్రారంభించాడు. 'విక్రమ్' చిత్రంతో మొదలై ఇప్పటి వరకు 90 చిత్రాల్లో నటించి మెప్పించారు అక్కినేని నాగార్జున.

అయితే కెరీర్ పరంగా చూస్తే చిరంజీవి నాగార్జున కంటే ఎంత సీనియరో మనకు ఇట్టే అర్థమవుతుంది. అయితే చిరంజీవి సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో ఎన్నో కష్టాలు పడ్డారని చాలా మంది సినిమా ప్రముఖులు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే చిరంజీవి మాత్రం ఎంత కష్టపడ్డారో అలాంటి రికార్డులను సెట్ చేశారు. ముఖ్యంగా అప్పట్లో చిరంజీవి ఇండస్ట్రీకి రాకముందు వరకు డ్యాన్స్, యాక్షన్, సినిమా టేకింగ్ ఓ మాదిరిలో ఉంటే.. చిరంజీవి వచ్చాక అన్నీ మారిపోయాయంట.
అందుకే సినిమా ప్రముఖులు టాలీవుడ్ ను చిరంజీవికి ముందు, చిరంజీవికి తర్వాత అని అభివర్ణిస్తుంటారు. అందుకు చిరంజీవికి టాలీవుడ్ లో అంతటి గౌరవ, మర్యాదలు దక్కుతున్నాయి. ఇక ఒక సందర్భంలో చిరంజీవిని చూసి నాగార్జునే వణికిపోయారంట. అది స్వయంగా నాగార్జునే చెప్పడం ఆసక్తికరంగా మారింది. నాగార్జున కెరీర్ బిగినింగ్ లో తన నాన్న లెజెండ్ యాక్టర్, దివంగత అక్కినేని నాగేశ్వర రావుతో సెట్స్ కు వెళ్లేవారంట. ఆ సమయంలో అక్కినేని నాగేశ్వర రావు నాగార్జున సినీ ఇండస్ట్రీని పరిచయం చేస్తూ చిరంజీవి గురించి ఓ సందర్భంలో చెప్పారంట.
ఆ తర్వాత చిరంజీవి నటిస్తున్న ఓ చిత్రంలో డ్యాన్స్ చూసేందుకు నాగార్జున సెట్స్ కు వెళ్లారంట. అది కూడా నాగేశ్వర రావు రెఫర్ చేయడంతో వెళ్లి చిరు డ్యాన్స్ ను ప్రత్యేక్షంగా చూశారంట నాగ్. చిరు గ్రేస్, స్పీడ్, స్టైలిష్ డ్యాన్స్ కు నాగార్జున షాక్ అయ్యారంట. పెర్ఫామెన్స్ అంటే ఈ రేంజ్ లో ఉంటుందా అంటూ వణికిపోయాడంట. ఆ తర్వాత చిరంజీవి భయం పట్టుకుందని నాగార్జున చెప్పుకొచ్చారు. అలా చిరంజీవిపై మరింత అభిమానం, గౌరవం పెరిగిందని నాగార్జున ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు నాగార్జు, చిరంజీవి ఎంత స్నేహపూర్వకంగా ఉంటారో తెలిసిందే. ఇక ప్రస్తుతం నాగార్జున రజినీకాంత్ 'కూలి' చిత్రంలో నటిస్తున్నారు. చిరంజీవి 'విశ్వంభర' మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











