నాగార్జున ఫిట్ నెస్ సీక్రెట్.. 35 ఏళ్లుగా ఒక్కటే మంత్రం.. దాంతోనే రోజంతా ఫ్యాట్ బర్న్
టాలీవుడ్ సీనియర్ హీరోగా కింగ్, అక్కినేని నాగార్జున ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. లీడ్ లోనే కాకుండా ఇంప్టార్టెంట్ పాత్రల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. 65 ఏళ్ల వయస్సులోనూ తన యంగ్ లుక్ తో అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు. ఎప్పుడూ ఎనర్జిటిక్ గా, యంగ్ గా నాగార్జున కనిపించడానికి గల కారణం ఏంటనేది చాలా మందిలో ఉన్న సందేహం. అయితే స్వయంగా నాగార్జునే తన యంగ్ లుక్ వెనకాల ఉన్న రహస్యాన్ని చెప్పారు. ఆ వివరాల్లోకి వెళితే..
కుబేరాతో బ్లాక్ బాస్టర్..
అక్కినేని నాగేశ్వర రావు తనయుడిగా అక్కినేని నాగార్జున తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. తండ్రికి తగ్గ తనయుడిగా చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా నటిస్తున్నారు. సినిమాలే కాకుండా వ్యాపారాల్లోనూ సక్సెస్ సాధించారు. అయితే ఆయన కెరీయర్ లో ఇప్పటి వరకు 99 చిత్రాల్లో నటించి మెప్పించారు. ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలను అందుకున్నారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ నాగార్జున జోరు తగ్గడం లేదు. ఆ మధ్యలో బంగార్రాజు, సోగ్గాడే చిన్ని నాయన వంటి చిత్రాలతో హిట్స్ అందుకున్నారు. తాజాగా కుబేరా చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు. ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్ల వరకు వసూళ్లు చేసింది.

నాగార్జున యంగ్ లుక్ సీక్రెట్..
నాగార్జున వయస్సు ప్రస్తుతం 65 ఏళ్లు. అయితే నాగార్జున ఇప్పటికీ యంగ్ లుక్ తో ఆకట్టుకుంన్నారు. రిటైర్ మెంట్ ఇవ్వాల్సిన వయస్సులో భారీ యాక్షన్ చిత్రాల్లో నటిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే నాగార్జున తన రీసెంట్ ఇంటర్వ్యూలో ఫిట్ నెస్ గురించి మాట్లాడారు. ఆయన పుష్టిగా ఏది తినాలనిపిస్తే అది తింటానని చెప్పారు. కానీ మితంగా తింటానని వివరించారు. కానీ బాడీలో మెటబాలిజం హైలో ఉండేలా చూసుకుంటున్నానని, అందుకోసం ఉదయం తప్పకుండా వర్క్ అవుట్స్ చేస్తానని చెప్పారు. దాంతో పాటు కాస్తా డైట్ ప్లాన్ కూడా ఫాలో అవుతానని చెప్పుకొచ్చారు. 35 ఏళ్లుగా ఫ్యాట్ పెరగకుండా చూసుకుంటున్నానని చెప్పారు. ఇక నాగార్జున ఫాలో అయ్యే డైట్, ఎక్సర్ సైజ్ ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
నాగార్జున డైలీ రోటీన్..
ప్రతి రోజూ ఉదయమే నాగార్జున వర్క్ అవుట్స్ చేస్తారు. వారానికి 5 లేదా 6 రోజులు తప్పకుండా ఉదయం దాదాపు గంట పాటు ఎక్సర్ సైజ్ లు చేస్తారు. వెయిట్ లాస్, కార్డియో, మజిల్స్, స్ట్రెచ్ వంటి రకాల ఎక్సర్ సైజ్ లు చేస్తారు. మజిల్స్ ను షేప్ లో పెట్టేందుకు కూడా నిపుణుల సలహాలతో పలు వర్కౌట్స్ చేస్తారు.
నాగార్జున తీసుకునే ఆహారం..
నాగార్జున ప్రతి రోజూ కూరగాయాల భోజనం, మాసం ఉండేలా చూసుకుంటారు. ఈ క్రమంలో సమయ పాలన పాటిస్తారు. 12:12 అనే ఉపవాస పద్ధతిని కూడా నాగ్ అనుసరిస్తారంట. అంటే రోజుకు కనీసం 12 గంటలు తింటే.. మరో 12 గంటలు ఉపవాసం ఉంటారంట. అదే విధంగా రాత్రి ఎట్టిపరిస్థితుల్లో 7 లేదా 7:30 గంటలకు భోజనం ముగించేస్తారంట. ఈ మధ్యలో తనకు కావాల్సిన అన్ని వంటకాలను తింటానని చెప్పారు. ఇక రాత్రి పడుకునే ముందే ఏదైనా ఒక స్వీట్ తిని పడుకోవడం ఇష్టమన్నారు.


Click it and Unblock the Notifications











