For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ghost: ఆ బ్యూటీతో ఊటీకి నాగార్జున.. అలాంటి వీడియోతో చెప్పకనే చెప్పేశారుగా!

  |

  దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన మార్కును చూపిస్తూ స్టార్‌ హీరోగా వెలుగొందుతున్నారు కింగ్ అక్కినేని నాగార్జున. ఏఎన్నార్ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. చాలా తక్కువ సమయంలోనే తన సత్తాను నిరూపించుకుని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అలాగే, ఫాలోయింగ్‌ను సైతం భారీ స్థాయిలో పెంచుకున్నారు. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే, చాలా కాలం పాటు నాగార్జున విజయాన్ని అందుకోలేక ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూనే వచ్చారు. కానీ, ఫలితం మాత్రం దక్కలేదు.

  Rahul Sipligunj Arrest: రాహుల్ సిప్లీగంజ్ అరెస్ట్.. పోలీసుల అదుపులో మరికొందరు ప్రముఖులు!

  వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడుతోన్న నాగార్జున గత ఏడాది 'బంగార్రాజు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ఆయన కుమారుడు యువ సామ్రాట్ నాగ చైతన్య కూడా నటించాడు. కల్యాణ్ కృష్ణ కురసాల రూపొందించిన ఈ మూవీ సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా చేశారు. దీన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయింది. ఎన్నో అంచనాలతో వచ్చిన దీనికి అన్ని వర్గాల నుంచి భారీ స్పందన వచ్చింది. ఫలితంగా కలెక్షన్లు రాబట్టుకుని హిట్‌గా నిలిచింది.

  Akkineni Nagarjuna Ghost Next Schedule in Ooty

  'బంగార్రాజు' మూవీ కంటే ముందే కింగ్ అక్కినేని నాగార్జున.. విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన ప్రవీణ్ సత్తారుతో 'ఘోస్ట్' అనే సినిమాను మొదలు పెట్టారు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ కరోనా సెకెండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. దీంతో ఈ సినిమా మొత్తానికి ఆగిపోయినట్లు ప్రచారం జరిగింది. కానీ, కొద్ది రోజుల తర్వాత ఇది పున: ప్రారంభం అయింది. దీంతో ఆ అనుమానాలకు పుల్‌స్టాప్ పడిపోయింది. ఇక, చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మళ్లీ మొదలైంది. దుబాయ్‌లో దీనికి సంబంధించిన సాంగ్‌తో పాటు కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించారు.

  Malaika Arora: రోడ్డు ప్రమాదానికి గురైన హీరోయిన్.. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే!

  'ఘోస్ట్' మూవీని అనుకున్న సమయానికి పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్న చిత్ర యూనిట్ వరుసగా షెడ్యూళ్ల మీద షెడ్యూళ్లను జరుపుకుంటోంది. తాజాగా దుబాయ్‌లో షూట్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ఊటీలో కీలక షెడ్యూల్‌ను జరుపుకోబోతుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అంతేకాదు, అక్కడ భారీ ఛేజింగ్ సీన్స్‌ను చిత్రీకరించబోతున్నట్లు కూడా ఓ వీడియో ద్వారా వెల్లడించింది. దీంతో ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుంది అన్న విషయాన్ని పరోక్షంగా వివరించినట్లైంది. ఫలితంగా ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఘోస్ట్' మూవీ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఇందులో అక్కినేని నాగార్జున ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా చేస్తున్నట్లు ఇప్పటికే రివీల్ చేసేశారు. ఇందులో ఆయనకు జోడీగా సోనాల్ చౌహాన్ నటిస్తోంది. ఇక, ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కీలక పాత్రను చేస్తుందనే టాక్ వినిపిస్తోంది.

  English summary
  Akkineni Nagarjuna Now Doing Ghost Movie Under Praveen Sattaru Direction. This Movie Next Schedule Planned in Ooty.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X