చైతూపై నాగార్జునకు ఇలాంటి ఒపీనియనా? ఫైనల్ గా ఓపెన్ అయిన నాగ్.!
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య తాజాగా 'తండేల్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 'జోష్' చిత్రం మొదలు నేటి 'తండేల్' వరకు చైతూ చాలా సినిమాలే చేశారు. అందులో కొన్ని మిక్స్డ్ ఫలితాలనిచ్చాయి. ఏమాయ చేసావె, 100% లవ్, మనం, ఒక లైలా కోసం, ప్రేమమ్, మజిలి, లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి చిత్రాలు మంచి రిజల్ట్ ను అందించాయి. ఆడియెన్స్ ను మెప్పించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్లు రాబట్టాయి. అలా చైతన్య 20 ఏళ్ల కెరీర్ నడుస్తూ వచ్చింది. అక్కినేని నట వారసుడిగా చైతూ ఫ్యాన్స్ ను ఒప్పించే సినిమాలు చేసేందుకు విపరీతంగానే ప్రయత్నిస్తున్నారు.
అయితే.. చైతన్య ఇప్పటి వరకు ఇరవై ఐదుకు పైగానే సినిమాలు చేశారు. కానీ చైతూకు నటన పరంగా పెద్ద గుర్తింపును తెచ్చిపెట్టిన సినిమాలు లేవనే చెప్పాలి. మొట్టమొదటి చిత్రం 'జోష్' మాత్రం యూత్ లో మంచి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది. ఆ తర్వాత 100%లవ్ తో డిఫరెంట్ అటెంప్ట్ చేసి ఆడియెన్స్ ను మెప్పించారు. ఇక కొన్నేళ్లకు 'తండేల్'తో చై నటన గురించి మాట్లాడే అవకాశం వచ్చింది. తండేల్ మూవీలోని లవ్, ఎమోషనల్, దేశభక్తి సీన్లలో చైతూ పెర్ఫామెన్స్ కు ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ కూడా ఫిదా అవుతున్నారు. సినిమా కోసం ప్రాణం పెట్టారని ఆకాశానికి ఎత్తుతున్నారు.

'తండేల్' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న టీమ్ తాజాగా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ ఈ వెంట్ కు అక్కినేని నాగార్జున ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తన కొడుకు నటన గురించి చాలా సంతోషం వ్యక్తం చేశారు. నాగార్జున మాట్లాడుతూ.. 'చైతూ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. ప్రతి సీన్ లో జీవించిపోయాడు. చందు మొండేటి చైతూ లోని నటుడిని బయటికి తీసుకొచ్చాడు'.. అని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు నాగ్ మాటలు ఆసక్తికరంగా మారాయి. చైతూ ఇరవై ఏళ్ల కెరీర్ లో తండ్రికి నచ్చిన సినిమా 'తండేల్' రూపంలో వచ్చిందా? అని సినీ లవర్స్ అంటున్నారు.
మొత్తానికి నాగార్జున గారితో చైతన్య నటనపై ప్రత్యేకంగా మాట్లాడేలా చేశాడని చైతూ అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇలాంటి మరెన్నో విజయాలు చైతూను వరించాలని, డిఫరెంట్ రోల్స్ తో తెలుగు ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేయాలని నెటిజన్లు సైతం కోరుకుంటున్నారు. ఇక చైతూ తండేల్ బాక్సాఫీస్ వద్ద రూ.80 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది. త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టబోతోంది. ఈ చిత్రానికి 'కార్తీకేయ' చిత్రంతో బ్లాక్ బాస్టర్ అందుకున్న చందూమొండేటి దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించగా, అల్లు అరవింద్ ప్రజెంట్ చేశారు. లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి హీరోయిన్ గా దుమ్ములేపింది. దేవీ శ్రీప్రసాద్ సంగీతంతో సినిమాకు ప్రాణంపోశారు.


Click it and Unblock the Notifications











