నిద్ర కూడా పట్టేది కాదు .. దేవుడే దిక్కని, నాగార్జునను అంతలా టెన్షన్ పెట్టిందెవరు?
తెలుగుజాతి గర్వించదగ్గ మహానటుడు, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు అక్కినేని నాగార్జున . టాలీవుడ్‌లో రోమాంటిక్ హీరో ఇమేజ్ కొంతమందికే ఉంది. వారిలో కింగ్ నాగార్జున ఒకరు. దశాబ్థాలుగా తెలుగు చిత్ర పరిశ్రమను నాలుగు స్తంభాలుగా మోస్తున్న ఒకరిగా ఆయన స్థానం సంపాదించారు. మాస్ చిత్రాలతో యువతకు పూనకాలు తెప్పించినా, భక్తిరస చిత్రాలతో ప్రజలను భక్తి పారవశ్యంలో ముంచెత్తినా నాగార్జునకే చెల్లింది.
అమ్మాయిల కలల రాకుమారుడిగా, యువ సామ్రాట్‌గా తెరపై సందడి చేశారు నాగ్. రోటిన్ మాస్ మసాలా సినిమాలు కాకుండా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథల్లో నటిస్తూ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలు చేస్తూ న్యూటాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో నాగార్జున ముందుంటారు. ఎంతోమంది దర్శకులు, హీరో, హీరోయిన్లు, టెక్నీషియన్లను ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు అందించారు. సినిమాలు, వ్యాపారాలే కాకుండా బుల్లితెరపై వ్యాఖ్యాతగానూ ప్రేక్షకులను అలరిస్తున్నారు నాగార్జున. 60 ప్లస్‌లోనూ చెక్కు చెదరని గ్లామర్‌తో.. కుర్రాళ్లే అసూయ పడేంత అందంతో అలరిస్తున్నారు.

తమ పని తాము చూసుకుంటూ , వివాదాలకు దూరంగా ఉండే అక్కినేని కుటుంబం ఈ మధ్యకాలంలో తరచు వార్తల్లో వినిపిస్తోంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, సమంత- నాగచైతన్యలపై కొండా సురేఖ వ్యాఖ్యలు, శోభిత - నాగచైతన్యల వివాహం తదితర అంశాలు తెలుగునాట హాట్ టాపిక్‌గా మారాయి. బిగ్‌బాస్ తెలుగు 8కి హోస్ట్‌గా వ్యవహరిస్తూనే , తన సినిమాలు, వ్యాపారాలు , కుటుంబానికి సమయం కేటాయిస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్నారు నాగార్జున.
నాగార్జునను ఎప్పుడు చూసినా నవ్వుతూనే కనిపిస్తారు తప్పించి.. కోపం ఆయన ఫేస్‌లో కనిపించలేదని సన్నిహితులు చెబుతుంటారు. ఎంత పెద్ద సమస్య ఎదురైనా సరే కూల్‌గానే డీల్ చేస్తారు నాగ్. కుమారులిద్దరి భవిష్యత్‌ను సెట్ చేసే పనిలో ఉన్న నాగార్జున .. నాగచైతన్యకి పెళ్లి చేయగా, త్వరలో నిఖిల్ వివాహాన్ని కూడా గ్రాండ్‌గా చేయనున్నారు. గడిచిన రెండు మూడు నెలలుగా పలు వివాదాలు కుటుంబాన్ని చుట్టుముట్టాయి. వీటిని నాగ్ ఎలా డీల్ చేస్తారోనని అంతా షాక్ అయ్యారు. కానీ నాగార్జున ఏమాత్రం తడబడకుండా కుటుంబంలో తిరిగి ప్రశాంత వాతావరణాన్ని తీసుకొచ్చారు.
అలాంటి నాగార్జున సైతం కొన్ని ఇబ్బందుల వల్ల తీవ్ర మనోవేదన అనుభవించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిదానికి టెన్షన్ పడనని, సమస్య వచ్చిందంటే దానికి పరిష్కారం కూడా ఉంటుందని తాను నమ్ముతానని నాగ్ తెలిపారు. నేను మనిషినేనని, నాక్కూడా సమస్యలు వస్తాయని .. ఎన్నోసార్లు నిద్రలేని రాత్రులు గడిపానని ఆయన వెల్లడించారు. ఆలోచనలో ఉండిపోతే సమస్య మరింత పెద్దదవుతుందని నాగార్జున పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











