Naa Saami Ranga Trailer: ఈ ట్రైలర్ చూస్తే.. నా సామి రంగా అనాల్సిందే, మాస్ హీరోగా మరోసారి మన్మథుడు!

అక్కినేనా నాగార్జున హీరోగా, అషికా రంగనాథన్ హీరోయిన్ గా రాబోతున్న తాజా సినిమా నా సామి రంగా గురించి అందిరకీ తెలిసిందే. విజయ్ బిన్ని దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్, కరుణ కుమార్ లు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయింది. అదెలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథను అందించగా.. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే శివేంద్ర దాశరధి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా... చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దినేశ్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పని చేయబోతున్న ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ముఖ్యంగా 14వ తేదీన రోజు ఈ చిత్రం గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కాబోతుంది. భారీ ఎత్తున అంచనాలు నమోదు అయిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల అయింది.

Recommended Video

Naa Saami Ranga Trailer టాలెంట్ పట్టిన Nag.. ఆ రిస్క్ ఎవ్వరూ చెయ్యలేరు | Telugu Filmibeat

అయితే ట్రైలర్ ను అల్లరి నరేష్ వాయిస్ తో ప్రారంభించారు. కిష్టయ్యను కొట్టే మగాడు ఎవరైనా ఈ ఊర్లో ఉన్నారా అంటూ అల్లరి నరేష్ అడగ్గా.. కొందరు రౌడీలు నాగార్జున మీదకు దూసుకు వస్తారు. లుంగీ కట్టుకుని, స్టైల్ గా బీడీ తాగుతూ నాగార్జున వారితో ఫైటింగ్ చేయడం అదిరిపోయింది. ఈక్రమంలోనే రాజ్ తరుణ్ ఈల వేయడం.. అరేయ్ అంజి ఎస్కో అంటూ నాగార్జున చెప్పగానే.. అల్లరి నరేష్ డప్పుల కొడుతుండగా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాడు. ఇక ఆ తర్వాత అన్నయ్యా వరాలు నిన్ను రమ్మంటుంది అంటూ నాగార్జునకు చెబుతూ కనిపిస్తాడు.

Akkineni Nagarjuna Naa Saami Ranga Movie Trailer Released Full Review Here

ఇక హీరోయిన్ ఆషికా రంగనాథ్ అందంగా ముస్తాబై కారులోంచి దిగుతుండగా.. రాజ్ తరుణ్ ఆమె ఎవరని అడుగుతాడు. వెంటనే అల్లరి నరేష్ మన కిష్టయ్య లవ్స్ అంటూ చెప్పగా.. రాజ్ తరుమ్ నోరెళ్లబెడతాడు. వెంటనే కిష్టయ్య నరకడం తెలుస్తాది కాని సరసం ఎలా తెలుస్తది అంటాడు. ఆ వెంటనే నాగార్జున మీసాలు మెలేస్తూ.. హీరోయిన్ ను చూస్తాడు. ఇంత అందంగా ముస్తాబై వచ్చావేంటి అంటూ అడుగుతాడు. ఆషికా నాగార్జునను చూసే విధానం అయితే అదిరిపోయింది. నువ్విట్టా సినిమాకొస్తే.. నా సామి రంగా అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ మరింత బాగుంది.

Akkineni Nagarjuna Naa Saami Ranga Movie Trailer Released Full Review Here

నన్ను చూస్తే ఎట్టా అనిపిస్తోందని హీరోయిన్ అడగా.. గంధం నాగరాజు అనే ఓ డాక్టర్ ఉన్నాడు.. వాడికి చూపించుకునేదాకా నువ్విలా తిరక్కే అంటూ నాగ్ చెప్పిన డైలాగ్ మరింత అద్భుతం. ఇక ఆ తర్వాత అందరూ కలిసి తాగుతూ డ్యాన్స్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. మాస్ లుక్ లో కనిపిస్తూ.. నాగార్జున చేసే పైటింగ్ సీన్లు అదిరిపోయాయి. అభిమానులందరినీ ఫుల్ గా మెస్మరైజ్ చేస్తున్న ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.. ఇంకా ఎందుకు ఆలస్యం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X