నాగార్జున వైల్డ్ డాగ్.. పోస్టర్‌తోనే అంచనాల డోస్ పెంచిన కింగ్
సూపర్ స్టార్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఎట్టకేలకు విడుదలైంది. గతంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసిన నాగార్జున ఈ సారి అంతకంటే హై రేంజ్ లో ఆకట్టుకునే విధంగా NIA ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. గగనం సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు NIA వైల్డ్ డాగ్ సినిమాతో సరికొత్త త్రిల్ ఇవ్వబోతున్నాడు. వైల్డ్ డాగ్ సినిమాపై ఇప్పటికే ఒక వర్గం ఆడియేన్స్ లో అంచనాలు గట్టిగానే పెరిగాయి. ఎందుకంటే భారత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇటీవల కాలంలో తన ప్రతిభ పోరాట శక్తితో ప్రపంచ దేశాలను ఎంతగానో ఆకర్షించింది. అలాంటి బ్యాక్ డ్రాప్ లో సినిమా అంటే కొత్తగా తెలియని విషయాలను ఏ విధంగా చూపిస్తారనే ఆసక్తి తప్పకుండా ఉంటుందనే కామెంట్స్ వస్తున్నాయి.

ఇక నాగార్జున బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కి ఆడియెన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. మిగతా పాత్రలకు సంబంధించిన డీటెయిల్స్ ని కూడా పోస్టర్ లో రివీల్ చేశారు. బిగ్ బాస్ ఫేమ్ అలీ రేజా కూడా ఈ సినిమాలో ఒక ఫీల్డ్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70% పూర్తయ్యింది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పై రూపొందిస్తున్న ఈ సినిమాను అహిషర్ సోలమన్ డైరెక్ట్ చేస్తున్నాడు. వైరస్ తీవ్రత తగ్గిన తరువాత వీలైనంత త్వరగా షూటింగ్ పనులను ముగించుకొని సమ్మర్ లోనే సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వైల్డ్ డాగ్ సినిమా అనంతరం నాగార్జున గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నారు.


Click it and Unblock the Notifications











