టబుతో పెళ్లిపై నాగార్జున క్లారిటీ.. ఆమెతో నా రిలేషన్ అదే .. అమలకు కూడా తెలుసు అంటూ!
చిత్ర పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య సంథింగ్ సంథింగ్ అనే రూమర్స్ కామన్. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఇండస్ట్రీలోని ఆడా, మగా కాస్త క్లోజ్‌గా కనిపిస్తే చాలు వారి మధ్య ఏదో ఉందంటూ ఉన్నవి లేనివి రాసేవారు ఎందరో. ఈ సందర్భంలో ఎక్కువగా టార్గెట్ అయ్యేది మాత్రం హీరో హీరోయిన్లే . ఆన్‌స్క్రీన్‌లో ఆ జోడీ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందంటే రియల్ లైఫ్‌కి ముడిపెట్టి వేడి వేడి వార్తలు వండుతూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఇటు పక్క రెండు జీవితాలు, రెండు కుటుంబాలు పడే ఇబ్బందులు మాత్రం వాళ్లకి పట్టవు.
ఇకపోతే.. సౌత్ నుంచి బాలీవుడ్‌లో అడుగుపెట్టి స్టార్స్‌గా వెలుగొందిన ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. శ్రీదేవి, జయప్రద ముందు వరుసలో ఉంటే అంతే స్టార్ డమ్‌ను సంపాదించారు టబు. ఆమె అసలు సిసలు తెలుగమ్మాయి, అందులోనూ పక్కా హైదరాబాదీ. నార్త్, సౌత్‌లోని అందరు టాప్ హీరోలతో నటించారు. ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ, మనసుకు నచ్చిన పాత్రల్లోనే నటించేవారు. అందుకే మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే ఆమె ప్రయాణం చాలా నిదానంగా సాగినట్లుగా అనిపిస్తుంటుంది. వయసు పెరుగుతున్న దశలో అందుకు తగినట్లుగానే పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌ను ముందుకు నడిపిస్తోంది.

అందరు హీరోయిన్ల మాదిరిగానే టబు విషయంలోనూ ఎన్నో రూమర్లు వచ్చాయి. ముఖ్యంగా కింగ్ నాగార్జున్-టబు రిలేషన్‌లో ఉన్నారంటూ ఏళ్లుగా గాసిప్స్ నడుస్తూనే ఉన్నాయి. నిన్నేపెళ్లాడతా మూవీలో తొలిసారిగా నటించిన సమయంలోనే వీరిద్దరి కెమిస్ట్రీకి వంద మార్కులు పడ్డాయి. ఆ మూవీలో వారి ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌కి ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవ్వడంతో జంట బాగుందంటూ ప్రశంసలే కాదు పుకార్లు వచ్చాయి. తమపై వచ్చే గాసిప్స్‌కు మొదట్లో వీరిద్దరూ ఇబ్బందిపడినా, తర్వాత పట్టించుకోవడం మానేశారు.
ఇన్నేళ్లు గడుస్తున్నా నాగార్జున - టబుల ఇష్యూపై సందర్భం వచ్చినప్పుడల్లా చర్చ నడుస్తూనే ఉంటుంది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టబ్‌తో ప్రేమాయణంపై క్లారిటీ ఇచ్చారు కింగ్. టబు హైదరాబాద్ వస్తే మా ఇంట్లోనే ఉంటుందని, మా ఇంటికి ముందున్న ఫ్లాట్ టబుకి తన భార్య అమల దగ్గరుండి కట్టించిందని నాగ్ చెప్పారు. సినిమాల్లోకి రాకముందే, అంటే టబుకి 16 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ఆమెతో తనకు ఫ్రెండ్‌షిప్ ఉందని ఆయన తెలిపారు.

టబు నా బెస్ట్ కో ఆర్టిస్ట్.. నా ఫేవరేట్ హీరోయిన్ ఎవరని అడిగితే ఆమె పేరే చెబుతానని, తను మా ఫ్యామిలీలో ఓ మెంబర్ అని నాగార్జున వెల్లడించారు. అమ్మా, నాన్నలకు కూడా టబు అంటే చాలా ఇష్టమని.. ఆమె అందరిలా కాదని చాలా ఎమోషనల్ అని ఆయన తెలిపారు. అందుచేత టబుకి తానొక సైకియార్టిక్ డాక్టర్‌నని, ఎప్పుడైనా బాధ కలిగితే అర్ధరాత్రి రెండు గంటలకు కూడా నాకు ఫోన్ చేస్తుందని.. హైదరాబాద్ వచ్చేయ్ అని చెప్తానని నాగ్ గుర్తుచేశారు. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం టబుకి లేదని, అందుకే బ్యాచిలర్‌గా ఉండిపోయిందని ఆయన వెల్లడించారు.
ఇదే ఇంటర్వ్యూలో అనుష్కతో తనకు అఫైర్ ఉందంటూ జరుగుతున్న ప్రచారంపైనా నాగార్జున క్లారిటీ ఇచ్చారు. స్వతహాగా తాను చాలా హైట్‌గా ఉంటానని, అలాంటిది తన పక్కన పొట్టిగా ఉన్న అమ్మాయిల కంటే హైట్‌గా ఉండేవాళ్లే బాగుంటారని ఆయన చెప్పారు. అందుకే దర్శక నిర్మాతలకు పొడుగ్గా ఉండే హీరోయిన్లను తీసుకోమని రికమెండ్ చేస్తూ ఉంటానని , జోడీ బాగుంటుందని అనుష్కనే రిపీట్ చేసేవాడినని నాగ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











