అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ అయ్యే న్యూస్.. నాగ్ నుంచి రెండు గుడ్‌ న్యూస్‌లు ఒకేసారి

By Manoj Kumar P

పేరుకు సీనియర్ హీరోనే అయినా అందంలో కుర్రాళ్లతో పోటీ పడుతున్నాడు అక్కినేని నాగార్జున. కేవలం ఆ విషయంలోనే కాదు.. సినిమాలు చేయడంలోనూ.. వ్యాపార ప్రకటనలు.. టీవీ షోలు ఇలా అన్నింటిలోనూ ఆయన టాలీవుడ్ హీరోలు అందరికంటే ముందే ఉన్నాడు. ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. అలాగే, బుల్లితెరపైనా కొన్ని షోలతో మెప్పిస్తున్నాడు. ఇటీవలే బిగ్ బాస్ షోను పూర్తి చేసుకున్న నాగ్.. త్వరలోనే అక్కినేని ఫ్యాన్స్‌కు రెండు శుభవార్తలు చెప్పనున్నాడట. వివరాల్లోకి వెళితే...

ఫ్యాన్స్‌కు నిరాశను మిగిల్చింది

ఫ్యాన్స్‌కు నిరాశను మిగిల్చింది

అక్కినేని నాగార్జున.. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2' అనే సినిమా చేశాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు. దీంతో నాగ్ కెరీర్‌లోనే ఓ డిజాస్టర్ మూవీగా నిలిచిపోయింది. ఇందులో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ సినిమా అక్కినేని అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసిందనే చెప్పాలి.

బిగ్ బాస్ షోతో మెప్పించాడు

బిగ్ బాస్ షోతో మెప్పించాడు

నాగార్జున సినిమాతో తన అభిమానులను నిరాశ పరిచినప్పటికీ, ‘బిగ్ బాస్' షోతో మాత్రం ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌కు హోస్టింగ్ బాధ్యతలు నిర్వహించిన నాగ్.. టీఆర్పీ రికార్డులను సైతం బద్దలు కొట్టేశాడు. ఫలితంగా సినిమా ఫలితంతో నిరాశ చెందిన అభిమానులకు ఊరటను కలిగించాడు. ఈ షోలో నాగ్ బాడీ లాంగ్వేజ్ కూడా అందరిని మెప్పించిందనే చెప్పాలి.

జాగ్రత్తలు తీసుకోవాలని డిసైడ్

జాగ్రత్తలు తీసుకోవాలని డిసైడ్

‘మన్మథుడు 2' సినిమా డిజాస్టర్‌గా మిగలడంతో నాగార్జున తన తదుపరి చిత్రాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. కొద్ది సంవత్సరాలుగా సరైన హిట్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అక్కినేని అందగాడు.. ఈ సారి ఎలాగైన సక్సెస్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకోసం కథల ఎంపిక సరిగా ఉండాలనుకుంటున్నారట.

రొటీన్‌కు భిన్నంగా ట్రై చేస్తున్నాడు

రొటీన్‌కు భిన్నంగా ట్రై చేస్తున్నాడు

ఇప్పటి వరకు రొటీన్ కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ వచ్చిన నాగార్జున.. ఇకపై సరికొత్తగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కథలో వైవిధ్యం చూపించాలన్న ఉద్దేశ్యంతోనే ఇప్పటి వరకు సినిమాను ఓకే చేయలేదని ఫిలిం నగర్‌లో ఓ టాక్ వినిపిస్తోంది. ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి కూడా ఆయన సిద్ధం అవుతున్నట్లు వినికిడి.

ఒక గుడ్ న్యూస్ ఇదే

ఒక గుడ్ న్యూస్ ఇదే

అక్కినేని అభిమానులకు నాగార్జున త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నారట. అది మరేంటో కాదు.. తన కొత్త సినిమా ప్రకటన గురించి. అవును.. నాగ్ కొద్ది రోజుల్లో తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన చేయనున్నాడని సమాచారం. దీని ద్వారా సాల్మన్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడట. అతడు గతంలో ‘ఊపిరి' సినిమాకు రైటర్‌గా పని చేశాడు.

Recommended Video

#CineBox : Mahesh Babu Sarileru Neekevvaru Movie Updates !
రెండో గుడ్ న్యూస్ ఏంటంటే..

రెండో గుడ్ న్యూస్ ఏంటంటే..

నాగార్జన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయన'. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో దీనికి సీక్వెల్ ‘బంగార్రాజు' తీయడానికి సన్నాహాలు చేశారు నాగ్, దర్శకుడు కల్యాణ్‌లు. అయితే, ఈ సినిమా ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను వచ్చే నెలలో ప్రారంభించనున్నారట. అంతేకాదు, ఒకేసారి రెండు సినిమా షూటింగ్‌లలో పాల్గొనబోతున్నాడట నాగ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X