అబ్బో! అలాంటి అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు.. రకుల్‌పై నాగార్జున కామెంట్

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సర్వహంగులతో రూపొందింది 'మన్మథుడు 2' మూవీ. గతంలో నాగార్జున కెరీర్‌లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన మన్మథడు చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. చిత్రంలో నాగార్జున సరసన యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించగా.. సమంత, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 9న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నాగార్జున రకుల్ ప్రీత్ గురించిన ఓ ఆసక్తికర విషయం చెప్పాడు.

చూడటానికి రకుల్ బాగా లేదని తాను అన్నట్లుగా రూమర్స్ వచ్చాయని పేర్కొన్న నాగార్జున.. సెట్స్‌పై గానీ రియల్ లైఫ్‌లో గానీ రకుల్‌ చాలా ఆరోగ్యంగా ఉంటుందని అన్నాడు. అంత హెల్తీగా ఉండే అమ్మాయిని తాను ఇంతవరకూ చూడలేదని, ఈ విషయం అందరికీ చెబుతుంటానని ఆయన పేర్కొన్నాడు. రకుల్ చాలా మంచి నటి అని కితాబిచ్చాడు. ఇక మన్మథుడు 2 సినిమాలో సమంత, కీర్తి సురేశ్‌ అతిథి పాత్రల్లో కొద్దిసేపు మాత్రమే కనిపిస్తారని నాగ్ వెల్లడించాడు.

 Akkineni Nagarjuna Reacted About Rakul Preet Singh

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్‌ని బట్టి 'మన్మథుడు 2'లో నాగార్జున, రకుల్ మధ్య రొమాంటిక్ డోస్ ఎలా ఉంటుందనేది చెప్పేశాయి. ఈ చిత్రంలో నాగ్‌తో రొమాన్స్ చేసేది ఒక్క రకుల్ మాత్రమే కాదు ఇంకా చాలామంది బ్యూటీలు ఉన్నారని కూడా మన్మథుడు 2 అప్‌డేట్స్ ద్వారా తెలిసింది. అయితే రొమాంటిక్ డోస్‌తో కుటుంబ కథా నేపథ్యంలో సాగే సినిమా ఇది అని చెబుతోంది చిత్రయూనిట్. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X