నాటుకోడి తిని.. బీరు తాగినప్పుడు ఈ ఆలోచన వచ్చింది.. నాగార్జున మాటల్లో
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున .. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించారు. వరుస విజయం సాధిస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఆరు పదుల వయసు దాటిన ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీపడుతూ నవ మన్మధుడు లా కనిపిస్తాడు. తన నటనతో ఎంతోమంది అమ్మాయిల మనసుని గెలుచుకున్నాడు కింగ్ నాగార్జున. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా ఆధ్యాత్మిక సినిమాలలో కూడా నటించి మెప్పించిన ఘనత కింగ్ నాగార్జున సొంతం.
మాస్, క్లాస్, రొమాంటిక్ సినిమాల్లో నటించిన నాగార్జున.. అన్నమయ్య, శిరిడి సాయిబాబా వంటి ఆధ్యాత్మిక సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలు కింగ్ నాగార్జున కెరీర్ లో మర్చిపోలేని సినిమాలు గా నిలుస్తాయి. కేవలం సినిమాలలోనే కాకుండా వాణిజ్య ప్రకటనల్లో.. బిగ్ బాస్ లాంటి షోలకు హోస్ట్ గా వివరిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం నాగార్జున సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అందులో హీరో నాగార్జున మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

శిరిడి సాయిబాబా సినిమా తీయాలని ఆలోచన ఎందుకు వచ్చింది యాంకర్ ప్రశ్నించగా.. తాను శిరిడి సాయిబాబా సినిమా తీసినంత వరకు ఒక్కసారి కూడా శిరిడి వెళ్లలేదని, అయితే నాకు ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో ఇప్పటికీ తెలియదని నాగార్జున అన్నారు. బహుశా ఇది సాయిబాబా లీలనే కావచ్చని చెప్పుకొచ్చారు. అయితే.. తాను సోమవారం నుండి శనివారం వరకు వర్క్ టెన్షన్ లో బిజీ బిజీగా ఉంటానని, ఫుడ్ విషయంలో చాలా కేర్ గా ఉంటానన్నారు. కానీ, ఆదివారం వస్తే మాత్రం అలాంటి లిమిట్స్ పెట్టుకోకుండా.. ఫుల్లుగా నాటుకోడి బిర్యానీ తిని, బీరు తాగి ఎంజాయ్ చేస్తానని, నిద్రపోతానని నాగార్జున తెలిపారు.
' శిరిడి సాయి బాబా సినిమా ఆలోచన అసలు ఎందుకో తెలియదు. అలాంటి సమయంలో శిరిడి సాయిబాబా సినిమా గురించి ఆలోచన వచ్చిందని, రాఘవేంద్రరావుని కలిసినప్పుడు ఆ విషయం గురించి మాట్లాడాలని తెలిపారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఊహించని విధంగా శిరిడి సాయిబాబాను దర్శించుకోవలసి వచ్చిందని, అక్కడ అకామిడేషన్ ఇచ్చింది కూడా రాఘవేంద్రరావు ఫ్రెండ్ సాయిబాబా అని, అనుకోకుండా ఆ వ్యక్తి శిరిడి సాయిబాబాకు ప్రొడ్యూసర్ గా మారారని తెలిపారు. తాను శిరిడికి వెళ్లిన విషయం ఎవరికీ చెప్పలేదని, వాస్తవానికి రాఘవేందర్ రావు గారి తనని షిరిడీకి తీసుకువెళ్లాలని ప్లాన్ చేశారని అన్నారు.ఏది ఏమైనా ఇది ఒక యాదృచ్ఛికమే అంటూ చెప్పుకొచ్చారు కింగ్ నాగార్జున.


Click it and Unblock the Notifications











