మన్మథుడు 2 సెట్స్‌లో నాగార్జునతో కీర్తి సురేష్ సరసాలు.. వైరల్ అవుతున్న పిక్స్
హీరోయిన్లతో రొమాన్స్ చేయడంలో అక్కినేని నాగార్జునను మించిన హీరో లేడనే చెప్పుకోవాలి. టాలీవుడ్ సీనియర్ హీరోగా కొనసాగుతున్న ఈయన ఇప్పటికే ఆ తరం, ఈ తరం అనే తేడా లేకుండా స్టార్ హీరోయిన్లందరితో రొమాన్స్ చేసేశాడు. అందుకే ఈయనను మన్మథుడు అని ముద్దుగా పిలుచుకుంటుంది టాలీవుడ్ ఇండస్ట్రీ. అయితే నేటికీ ఆయన లోని గ్లామర్, స్పీడ్ ఏ మాత్రం తగ్గక పోవడం.. యంగ్ హీరోయిన్లతో వరుసపెట్టి రొమాన్స్ చేస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. తన లేటెస్ట్ సినిమా మన్మథుడు 2 లో నాగార్జున యంగ్ హీరోయిన్స్ ఇద్దరితో తెగ సరసాలాడనున్నాడట. అందులో ఒకరు పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కాగా మరొకరు మహానటి కీర్తి సురేష్. ఈ ఇద్దరితో నాగ్ వేసే చిందులు మన్మథుడు 2 సినిమాలో హైలైట్ అవుతాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మన్మథుడి ఒడిలో కూర్చున్న కీర్తి సురేష్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఫొటో మన్మథుడు 2 సినిమా లోనిదే. సెట్స్ పై చిత్రీకరణ సమయంలో నాగార్జున ఒడిలో కీర్తి సురేష్ కూర్చున్న సందర్భంలో తీసిన ఫొటో ఇది. తాజాగా తమ సినిమాలో కీర్తి సురేష్ కూడా నటిస్తోందని పేర్కొంటూ ఈ ఫొటోని సోషల్ మీడియాలో పెట్టింది చిత్రయూనిట్. ఇందులో మన్మథుడు, మహానటి రొమాంటిక్ గా కనిపిస్తుండటంతో నెట్టింట అలా పెట్టగానే ఇలా వైరల్ అయిపోయిందీ పిక్.

ఇక మన్మథుడు 2 సినిమా విశేషాలు చూస్తే.. గతంలో వచ్చిన మన్మథుడు సినిమా ఇన్‌స్పిరేషన్‌తో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' చిత్రం తెరకెక్కుతోంది. చిత్రంలో కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా కీర్తి సురేష్, సమంత కీలక పాత్రలు పోషిస్తున్నారు. మనం ఎంటర్‌ప్రైజస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ (జెమిని కిరణ్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే పోర్చుగల్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.


Click it and Unblock the Notifications











