twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్‌తో పోటీకి దిగిన నాగార్జున.. ఎంతవరకు వర్కవుట్ అవుతుందో మరి!

    |

    యంగ్ హీరో ప్రభాస్ బాహుబలి తెచ్చిపెట్టిన ఇమేజ్‌తో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఫామ్ కొనసాగించేందుకు గాను సుజీత్ దర్శకత్వలో సాహూ సెట్స్ పైకి వచ్చేశాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టిన సాహూ టీమ్ జూన్ 13 వ తేదీన ఈ సినిమా టీజర్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇంతవరకు బాగానే ఉంది గానీ ఉన్నట్టుండి ప్రభాస్ టీజర్ విషయంలో పోటీకి దిగి ఆశ్చర్య పరిచాడు సీనియర్ హీరో నాగార్జున.

    నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మన్మథుడు 2'. గతంలో నాగార్జున కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిన మన్మథుడు సినిమాకు రెండో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే పోచుగల్ లో షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ చేస్తోంది. ఇక ఈ చిత్రంలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా, నాగార్జున కోడలు సమంత, కీర్తి సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    Akkineni Nagarjunas Competition with Prabhas

    అయితే ఈ సినిమా అప్ డేట్స్ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన జారీ చేయని చిత్రయూనిట్.. సడెన్ గా జూన్ 13 వ తేదీన మన్మథుడు 2 టీజర్ రిలీజ్ కానుందని ప్రకటించింది. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదలని ఈ చిత్ర యూనిట్ హఠాత్తుగా టీజర్ రిలీజ్ అనే సరికి ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు. ఇక ఇదే రోజు ప్రభాస్ సాహో టీజర్ కూడా వస్తుండటంతో సీనియర్ హీరో, యంగ్ హీరో కావాలనే పోటీకి దిగారని చెప్పుకుంటున్నారు. వ్యూస్ పరంగా ఎవరికి ఎక్కువ వ్యూస్ వస్తే వారిదే విజయం. సాహూలో యాక్షన్ ఉంటే, మన్మథుడు 2 లో రొమాన్స్ పుష్కలంగా ఉండే అవకాశముంది. సో చూడాలి మరి ఈ ఇద్దరిలో విన్నర్ ఎవరవుతారో!

    English summary
    Senior hero Akkineni Nagarjuna's Manamadhudu 2 teaser and young rebal star Prabhas Saaho teaser release on same day
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X