Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రభాస్‌తో పోటీకి దిగిన నాగార్జున.. ఎంతవరకు వర్కవుట్ అవుతుందో మరి!
యంగ్ హీరో ప్రభాస్ బాహుబలి తెచ్చిపెట్టిన ఇమేజ్‌తో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఫామ్ కొనసాగించేందుకు గాను సుజీత్ దర్శకత్వలో సాహూ సెట్స్ పైకి వచ్చేశాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టిన సాహూ టీమ్ జూన్ 13 వ తేదీన ఈ సినిమా టీజర్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇంతవరకు బాగానే ఉంది గానీ ఉన్నట్టుండి ప్రభాస్ టీజర్ విషయంలో పోటీకి దిగి ఆశ్చర్య పరిచాడు సీనియర్ హీరో నాగార్జున.
నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మన్మథుడు 2'. గతంలో నాగార్జున కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిన మన్మథుడు సినిమాకు రెండో భాగంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే పోచుగల్ లో షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ చేస్తోంది. ఇక ఈ చిత్రంలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా, నాగార్జున కోడలు సమంత, కీర్తి సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అయితే ఈ సినిమా అప్ డేట్స్ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన జారీ చేయని చిత్రయూనిట్.. సడెన్ గా జూన్ 13 వ తేదీన మన్మథుడు 2 టీజర్ రిలీజ్ కానుందని ప్రకటించింది. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదలని ఈ చిత్ర యూనిట్ హఠాత్తుగా టీజర్ రిలీజ్ అనే సరికి ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు. ఇక ఇదే రోజు ప్రభాస్ సాహో టీజర్ కూడా వస్తుండటంతో సీనియర్ హీరో, యంగ్ హీరో కావాలనే పోటీకి దిగారని చెప్పుకుంటున్నారు. వ్యూస్ పరంగా ఎవరికి ఎక్కువ వ్యూస్ వస్తే వారిదే విజయం. సాహూలో యాక్షన్ ఉంటే, మన్మథుడు 2 లో రొమాన్స్ పుష్కలంగా ఉండే అవకాశముంది. సో చూడాలి మరి ఈ ఇద్దరిలో విన్నర్ ఎవరవుతారో!