తప్పుగా క్రియేట్ చేసి ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు: నాగార్జున

రోజు రోజుకీ బాగా విస్తరిస్తున్న టెక్నాలజీ సరికొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. టెక్నాలజీ పెరిగిందని సంబర పడాలో లేక టెక్నాలజీ ముసుగులో మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామని బాధ పడాలో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి. సోషల్ మీడియాలో ఎవ్వరి పేరుతో అయినా స్వేచ్ఛగా అకౌంట్ ఓపెన్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో కొందరు సైబర్ కేటుగాళ్లు దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా సెలెబ్రిటీలకు ఇది కొరకరాని కొయ్యగా మారుతోంది.

తాజాగా హీరో నాగార్జున విషయంలో సైబర్ మోసం బయటపడింది. సాధారణంగా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నాగార్జున తన ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్‌డేట్స్ పోస్ట్ చేస్తుంటారు. అయితే ఆయనకు ఇన్స్‌స్టాగ్రామ్ అకౌంట్ మాత్రం లేదు. కానీ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నాగార్జున పేరుతో ఓ ఇన్స్‌స్టాగ్రామ్ అకౌంట్ దర్శమిస్తోంది. దీని ద్వారా నాగార్జునకు సంబంధించిన అప్‌డేట్స్ షేర్ చేయడం జరుగుతోంది. ఇది గమనించిన నాగార్జున దీనిపై స్పందించారు.

Akkineni Nagarjunas Fake Instagram Account found on social media

ఇది తన అఫీషియల్ అకౌంట్ కాదని, దీని ద్వారా వస్తున్న అప్‌డేట్స్ తాను ఇస్తున్నట్లుగా భావించొద్దని నాగార్జున పేర్కొన్నాడు. ఎవరో ఇలా తప్పుగా క్రియేట్ చేసి ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, తాను ఇన్స్‌స్టాగ్రామ్ లోకి రావాలనుకుంటే స్వయంగా ప్రకటించి వస్తానని ఆయన అన్నారు. ప్రస్తుతం నాగార్జున మన్మథుడు 2 సెట్స్ పై బిజీగా ఉన్నారు. యంగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కీర్తి సురేష్, సమంత మూల్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X