twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మన్మథుడు 2 లో నాగార్జున పెట్టుబడి.. ఎంతో తెలుసా?

    |

    రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మన్మథుడు 2'. గతంలో నాగార్జున కెరీర్ లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన మన్మథడు చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆడిపాడింది. సమంత, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ 18 పిక్చర్స్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాలో నాగార్జున పెట్టుబడి విషయంలో ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈ సినిమా నిర్మాణంలో భాగంగా ఎలాంటి రెమ్మ్యూనరేషన్ తీసుకోకుండా 24 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారట నాగార్జున. అన్ని హంగులతో సినిమా రూపొందించాలని మొదటి నుంచే చెబుతూ వచ్చిన నాగ్.. ఖర్చుకు ఎక్కడా వెనకాడలేదని చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పటికే జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా పెట్టుబడిలో సగం మొత్తం నిర్మాతలకు వచ్చేసిందని సమాచారం.

    Akkineni Nagarjunas investment in Manmadhudu 2

    రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మన్మథుడు 2. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాయి. సినిమా విషయంలో పలు వివాదాలు, ట్రోలింగ్స్ జరిగినప్పటికీ వాటికి వివరణ ఇచ్చి ప్రేక్షకులను క్లారిటీకి తీసుకొచ్చారు నాగార్జున, రాహుల్ రవీంద్రన్. ఆగస్టు 9 వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. చిత్రానికి చేతన్ భరధ్వాజ్ అందించిన సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానుంది.

    English summary
    Senior Hero Nagarjuna Manmadhudu 2 release date confirmed. This movie will release on August 9th. According to the latest update, Nagarjuna has invested Rs 24 Cr on this romantic and comedy entertainer Manmadhudu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X