మన్మథుడు 2 సెన్సార్ రిపోర్ట్.. అనుకున్న దానికి భిన్నంగా!
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన తాజా చిత్రం 'మన్మథుడు 2'. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పీ కిరణ్ (జెమిని కిరణ్) నిర్మించిన ఈ చిత్రంలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. లక్ష్మి, వెన్నెలకిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్టు 9న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసింది చిత్రయూనిట్.
కాగా తాజాగా మన్మథుడు 2 సినిమా చూసిన సెన్సార్ సభ్యులు 'U/A'సర్టిఫికెట్ జారీ చేశారు. నిజానికి ఇప్పటివరకు విడుదలైన అప్‌డేట్స్ ప్రకారం మన్మథుడు 2 లో రొమాంటిక్ డోస్ ఎక్కువగా కనిపించడంతో ఈ సినిమాకు 'A' సర్టిఫికెట్ వస్తుందని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా U/A సర్టిఫికెట్ జారీ కావడంతో ఇక మన్మథుడు 2 సినిమాను చిన్న, పెద్ద అంతా కలిసి చేసేయొచ్చు అని ఖుషీ అవుతున్నారు ప్రేక్షకులు.

ఈ సినిమాలో అమ్మాయిలంటే ఎక్కువగా ఇష్టపడే మన్మథుడిగా కనిపించనున్నాడు నాగార్జున. ఆరు పదుల వయసులో కూడా యంగ్ లుక్‌లో అదరగొట్టేయనున్నాడు. ఇక ఆయన సరసన రకుల్ ప్రీత్ సింగ్ అవంతిక పాత్రలో నటిస్తోంది. రెండు డిఫెరెంట్ కోణాల్లో రకుల్ పర్‌ఫార్‌మెన్స్ చూడనున్నారు ప్రేక్షకులు. పద్దతిగా కనిపిస్తూనే, మోడ్రెన్ యువతిగా రకుల్ అభినయం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కానుందని తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ ఆగస్టు 9 వ తేదీన మన్మథుడు 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్, హీరో నాగార్జున ఈ సినిమాపై పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు.



Click it and Unblock the Notifications











