twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇప్పుడే కోలుకుంటున్నా.. ఇలా చేయండని చెప్పేశా.. కేటీఆర్‌కి నాగార్జున ట్వీట్

    |

    వాతావరణం మార్పులు చోటు చేసుకోవడం, అపరిశుభ్రత కారణంగా ప్రస్తుతం రాష్ట్రమంతా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఎంతో మంది ప్రజలు డెంగీ, టైఫాయిడ్ లాంటి వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం దోమలు. ఈ దోమల కారణంగా కేవలం సామాన్య మానవులే కాదు.. సినీ సెలెబ్రిటీలు సైతం విష జ్వరాల వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. ఈ జాబితాలో నాగార్జున కూడా చేరిపోయారట. ఈ విషయాన్ని పేర్కొంటూ ఆయన చేసిన ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది.

    డెంగీ బారిన రేణు దేశాయ్

    డెంగీ బారిన రేణు దేశాయ్

    ఇప్పటికే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా విష జ్వరం బారిన పడిన సంగతి తెలిసిందే. డెంగీ బారిన పడిన ఆమె కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా వెల్లడించిన ఆమె.. తాను ఇంకా పూర్తిగా కోలుకోకుండానే ఓ టీవీ షోలో పాల్గొనాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

    దోమల విషయంలో జాగ్రత్త అంటూ రేణు

    దోమల విషయంలో జాగ్రత్త అంటూ రేణు

    ‘‘దోమలతో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. దోమల నుంచి కాపాడుకోవడానికి క్రీములు రాసుకోవడంతో పాటు, ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులు ధరించండి. దోమకాటుకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి'' అంటూ సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ మెసేజ్ ఇచ్చారు. తాజాగా ఇదే విషయమై నాగార్జున కూడా స్పందించారు.

    దోమల వ్యాప్తి పెరుగుతోంది.. ఎంటరైన నాగార్జున

    దోమల వ్యాప్తి పెరుగుతోంది.. ఎంటరైన నాగార్జున

    తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని, దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని నాగార్జున కూడా ట్వీట్ చేశారు. మురికి నీటి వల్ల దోమల వ్యాప్తి విపరీతంగా పెరుగుతోందని, తద్వారా అనారోగ్యానికి గురవుతామన్నారు నాగార్జున. ఈ మేరకు అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు నాగార్జున.

    కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ

    అయితే ప్రస్తుతం తాను జ్వరం నుంచి కోలుకున్నానని, ఆ జ్వరం కారణంగా ఒళ్లు నొప్పులు మాత్రం విపరీతంగా ఉన్నాయని తెలిపారు నాగ్. తన ఇంటితో పాటు, అన్నపూర్ణ స్టూడియోస్ పరిసరాల్లో మురికి నీరు నిల్వలు ఉండకుండా చూడమని తమ వారితో చెప్పానని పేర్కొంటూ ట్వీట్ చేశారు నాగార్జున. అదేవిధంగా మీ ఇల్లు, పనిచేస్తున్న పరిసరాల్లో మురికి నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని ఆయన తెలిపారు. ఇక నాగార్జున ఈ ట్వీట్‌ను కేటీఆర్‌కు ట్యాగ్ చేయడం విశేషం.

    Recommended Video

    Nagarjuna & V. Chamundeswaranath Gifts A Costly Car To PV Sindhu | చాలా కాస్ట్లీ గురూ!
    మన్మథుడి స్పెయిన్ టూర్

    మన్మథుడి స్పెయిన్ టూర్

    ఇటీవలే మన్మథుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగ్.. ఆశించిన ఫలితం రాబట్టలేక పోయారు. ఇక తన పుట్టిన రోజు సందర్బంగా అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి స్పెయిన్ చుట్టి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిగ్ బాస్ హోస్ట్‌గా అదరగొట్టేస్తున్నారు నాగార్జున.

    English summary
    Akkineni Nagarjuna recovering from viral fever. He posted a tweet as ''Just about recovered from viral fever.. The body pains were crazy!! Way out is stopping Mosquitoes breeding!! I asked my people to clear out all stagnant water at home and at Annapurna studios… Requesting you all to do it at your place of work and home''.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X