నాగార్జున అదిరిపోయే సర్‌ప్రైజ్.. వైల్డ్ డాగ్ అంటూ సడెన్ షాక్ ఇచ్చారుగా!
ఉన్నట్టుండి కింగ్ నాగార్జున అదిరిపోయే సర్‌ప్రైజ్ చేశారు. డిఫెరెంట్ జానర్‌లో రూపొందనున్న తన కొత్త సినిమాను ప్రకటించారు. అంతేకాదు అక్కినేని అభిమానులను ఆశ్చర్యపోయేలా ఆ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. 'మన్మథుడు 2' తర్వాత నాగార్జున హీరోగా రాబోతున్న ఈ సినిమా విశేషాలపై ఓ లుక్కేద్దామా..

వరుస సినిమాలతో నాగార్జున..
సీనియర్ హీరో అయినప్పటికీ సినిమాల పరంగానే గాక లుక్ పరంగా కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు నాగార్జున. ఈ మేరకు ఇటీవలే ‘మన్మథుడు 2' రూపంలో హంగామా చేసిన ఆయన ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ‘బ్రహ్మాస్త్ర'లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

వైల్డ్ డాగ్.. డిఫెరెంట్‌గా నాగార్జున
ఈ నేపథ్యంలో తెలుగులో ఆయన సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా తన నెక్ట్స్ సినిమా ‘వైల్డ్ డాగ్' అని ప్రకటిస్తూ ఆ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. నాగార్జున గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా డిఫెరెంట్ అని ఈ లుక్ చూస్తుంటే తెలుస్తోంది. టాలీవుడ్‌లో హీరోల్లో కెల్లా ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరో నాగార్జున, మరో ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడని అర్థమవుతోంది.

ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్.. నాగార్జున రోల్
మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిషోర్ సాల్మోన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున కనిపించనున్నారు. అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ వర్మను పోలీస్ శాఖలో అందరూ వైల్డ్ డాగ్ అని పిలుస్తుంటారు. అదే రోల్ నాగార్జున పోషిస్తున్నారు.

ఆసక్తి రేపేలా ఫస్ట్‌లుక్..
ఇక వైల్డ్ డాగ్ ఫస్ట్‌లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. డిఫరెంట్‌గా ఉన్న నాగార్జున లుక్ రీసెంట్‌గా జరిగిన దిశ హంతకుల ఎన్‌కౌంటర్ ను గుర్తుచేస్తోంది. తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమాలో అంతా కొత్త నటీనటులే అని పేర్కొంటూ ఈ లుక్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు నాగ్. ఈ సినిమా మేకింగ్ కూడా కొత్తగా ఉంటుందని పేర్కొన్నారు.
టాలీవుడ్‌పై నాగార్జున మార్క్
నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్నారు. చిత్రానికి కిరణ్ కుమార్ డైలాగ్స్ రాయగా, షానియల్ డియో సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మొత్తానికైతే మరోసారి నాగార్జున మార్క్ టాలీవుడ్ పై పడనుందని స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











