కుబేరా ధనుష్ సినిమా కాదు.. శేఖర్ కమ్ముల చేసిందిదే.. నాగార్జున షాకింగ్ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'కుబేరా'. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్ఎల్పీ సినిమాస్, అమిగోస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో నిర్మాత సునీల్ నారంగ్, శేఖర్ కమ్ముల నిర్మించారు. కాగా ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తమిళంతో పాటు హిందీలోనూ గ్రాండ్ గా విడుదలైంది. అటు ఓవర్సీస్ లోనూ పెద్ద ఎత్తున్న రిలీజ్ జరిగింది. మొదటి రోజు ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. కాగా తాజాగా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగార్జున షాకింగ్ కామెంట్స్ చేశారు. చిత్రంలో తన పాత్రనే మెయిన్ అంటూ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు.
కుబేరా చిత్ర వివరాలు..
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో క్రైమ్ డ్రామాగా రూపుదిద్దుకున్న చిత్రం కుబేరా. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, నేషనల్ క్రష్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. బిచ్చగాడిగా, దేవా అనే పాత్రలో ధనుష్ నటించారు. సీబీఐ ఆఫీసర్ దీపక్ అనే పాత్రను నాగార్జున పోషించారు. సమీరా అనే పాత్రలో రష్మిక మందన్న నటించింది. బాలీవుడ్ నటుడు జిమ్ సార్బ్ వ్యాపార వేత్తగా అలరించారు. అయితే వ్యాపారవేత్తలు తమ నల్లధనాన్ని వైట్ మనీగా ఎలా మార్చుకున్నారు, అందులో బిచ్చగాడిగా దేవా, సీబీఐ ఆఫీసర్ గా దీపక్ ల పాత్రలు ఎలా కదిలాయనేది సినిమా. అయితే ఈ చిత్రంలోని అన్ని పాత్రలకు మంచి రెస్పాన్స్ దక్కుతోంది.

ధనుష్ పాత్రకు ప్రశంసలు..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవల వరుసగా డైరెక్ట్ తెలుగు సినిమాలు చేస్తూ మంచి ఫలితాలను అందుకుంటున్నారు. డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు ప్రొడక్షన్ హౌజ్ లో సార్ అనే చిత్రంతో ధనుష్ భారీ బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు. ఇక తాజాగా కుబేరా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే కుబేరా చిత్రంలో ధనుష్ నటించిన బిచ్చగాడి పాత్ర అందరినీ ఆకట్టుకుంటోంది. బిచ్చగాడిగా ధనుష్ హావభావాలు, అటిట్యూడ్, ఎమోషనల్ సీన్లలో ఆయన నటనకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ధనుష్ పెర్ఫామెన్స్ కు మెచ్చుకుంటున్నారు.
నాగార్జున ఆసక్తికరమైన వ్యాఖ్యలు..
తాజాగా కుబేరా చిత్ర యూనిట్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో థ్యాంక్యూ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున, శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు... కుబేరా చిత్రంలో ధనుష్ పాత్రనే బాగా ఉందని, మీ పాత్రకు కూడా మంచి హైప్ ఉన్నప్పటికీ మీ నటనకు పెద్దగా రెస్పాన్స్ రావడం లేదనిపిస్తోందనే ప్రశ్నను నాగార్జున ఎదుర్కొన్నారు. ఇందుకు వెంటనే బదులిచ్చారు.
'కుబేరా చిత్రంలో నేను పోషించిన దీపక్ అనే పాత్రనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని, ఆ పాత్ర దీపక్ చుట్టూనే మిగితా పాత్రలన్నీ తిరుగుతూ ఉంటాయి. శేఖర్ కమ్ముల నాకు కథ చెప్పిన సమయంలోనూ నా పాత్రకే మంచి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. అలానే సినిమాకు ఒప్పుకున్నాను. జిమ్స్, ధనుష్ పాత్రలు ఒకే లైన్ లో సాగిపోతాయి. కానీ నేను పోషించిన దీపక్ పాత్రలో మూడు షేడ్స్ ఉన్నాయి. శేఖర్ కమ్ముల నాకోసమే ప్రత్యేకంగా డిజైన్ చేశారని అనిపిస్తుంది. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నాకు వస్తున్న ఫీడ్ బ్యాక్ పాజిటివ్ గానే ఉంది. అభిమానులైతే కింగ్ ఈజ్ కింగ్ అంటున్నార'ని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











