Don't Miss!
- News
మంకీపాక్స్ కలవరం: 10 రోజుల్లో 12 దేశాలకు వ్యాప్తి, వేగం పెరగనుందని డబ్ల్యూహెచ్ఓ అలర్ట్
- Sports
IND vs SA 2022: సన్‌రైజర్స్ ప్లేయర్స్‌కు పిలుపు?: రెండుగా టీమిండియా: కోచ్‌గా వీవీఎస్?
- Finance
176 NFOs మ్యూచువల్ ఫండ్స్ రూ.1.08 లక్షల కోట్ల సమీకరణ
- Technology
OnePlus స్నాప్‌డ్రాగన్ కొత్త చిప్ ఫీచర్లతో వన్‌ప్లస్ బ్రాండ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది
- Automobiles
పోర్ష్ టేకాన్ ఎలక్ట్రిక్ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించిన మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు మే 22 నుండి 28వ తేదీ వరకు..
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
The Ghost: మొదటిసారి అలాంటి లుక్ లో నాగార్జున.. క్లిక్కయితే బజ్ మామూలుగా ఉండదు
ఆరు పదుల వయసులోకి వచ్చినా కూడా ఎప్పటికి మన్మథుడు అనేలా కనిపించే కింగ్ నాగార్జున ప్రస్తుతం డిఫరెంట్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. కేవలం కమర్షియల్ రొటీన్ సినిమాలను మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేసే కింగ్ లుక్స్ తో కూడా అప్పుడప్పుడు షాక్ ఇస్తుంటారు. ఇక ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ఘోస్ట్ లుక్ ఇదేనని ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సరైన సక్సెస్ అందుకోలేదు
సక్సెస్ ఫెయిల్యూర్స్ ఎన్ని వచ్చినా కూడా ఎప్పటికి ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగే నాగార్జున రానున్న రోజుల్లో మరిన్ని డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నాగ్ గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ అందుకోలేదు. మన్మథుడు 2, వైల్డ్ డాగ్ వరుసగా నిరాశపరిచాయి.

బంగార్రాజు.. అదే సెంటిమెంట్
ఇక ఈసారి ఎలాగైనా బంగార్రాజు సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. 2016లో వచ్చిన సోగ్గాడే చిన్న నాయన సినిమాకు కొనసాగింపుగా వస్తున్న బంగార్రాజు సినిమా మళ్ళీ అదే సెంటిమెంటుతో సంక్రాంతికి వస్తోంది. జనవరి 14న రాబోయే ఆ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో..
ఇక బంగార్రాజు సినిమా అనంతరం నాగార్జున ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కున్న ఆ సినిమా డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. గరుడవేగ సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న ప్రవీణ్ సత్తారు ది ఘోస్ట్ స్క్రిప్ట్ కోసం చాలా రోజులు హార్డ్ వర్క్ చేశాడట.

ది ఘోస్ట్ లుక్ ఇదేనా..
ఇక ది ఘోస్ట్ సినిమాకు సంబంధించిన లుక్ ఇదేనని సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక ఆర్ట్ ఫోటో వైరల్ గా మారింది. గ్రాఫిక్స్ ద్వారా ఆ ఫొటోను డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. కానీ నాగార్జున ఈ లుక్ లో చాలా కొత్తగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఎప్పుడు లేని విధంగా కోర మీసాల మధ్యలో గెడ్డం కూడా కనిపిస్తోంది. మరి ఈ లుక్ తోనే నాగ్ కనిపిస్తాడా లేక మరొక లుక్ ఏదైనా ట్రై చేస్తారో లేదో చూడాలి.

బంగార్రాజు మేయిన్ స్టోరీ
బంగార్రాజు సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటించిన విషయం తెలిసిందే. ఆయన ఎప్పటిలానే ఆత్మ పాత్రలో బంగార్రాజుగా కనిపించనుండగా నాగచైతన్య యువ బంగార్రాజుగా కనిపించబోతున్నాడు. ఒక గుడి ఆ తరువాత గ్రామానికి వచ్చే సమస్య చుట్టూ కథ నడుస్తుందట. ఇక నాగచైతన్య ఆ సమస్యను ఎలా సాల్వ్ చేశాడు. అందుకు నాగార్జున ఆత్మ ఎలా హెల్ప్ అయ్యిందనేది సినిమాలోని మేజర్ ప్లస్ పాయింట్ అని తెలుస్తోంది.

బిజినెస్ ఎంతంటే..
ఇక బంగార్రాజు సినిమా మార్కెట్ లో 39కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడుదల కానుంది. పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడంతో అందరి ఫోకస్ ప్రస్తుతం బంగార్రాజుపైనే ఉంది. పైగా ఆంద్రప్రదేశ్ లో కూడా పండగ సమయంలో నైట్ కర్ఫ్యూ లేదని 100% ఆక్యుపెన్సీతో థియేయర్స్ కొనసాగవచ్చని అనుమతి ఇచ్చారు. మరి బంగార్రాజు సినిమా ఈ అడ్వాంటేజ్ లో ఏ స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.