బంగార్రాజు నుంచి ఊహించని ప్రకటన: వాళ్లిద్దరి ఫొటోను షేర్ చేసి మరీ గుడ్‌ న్యూస్ చెప్పిన నాగార్జున

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలా వచ్చిన చిత్రాల్లో చాలా వరకు సూపర్ డూపర్ హిట్లుగా నిలవడంతో దర్శక నిర్మాతలు, హీరోలు మరింత ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. అదే సమయంలో సక్సెస్ అయిన సినిమాలకు సీక్వెల్స్, ప్రీక్వెల్స్ కూడా కొంత కాలంగా తెరకెక్కుతున్నాయి. ఇప్పుడిలా వస్తున్న చిత్రాల్లో 'బంగార్రాజు' ఒకటి. నాలుగేళ్ల క్రితం విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు ఇది ప్రీక్వెల్‌గా రూపొందుతోంది. ఇందులో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునతో పాటు ఆయన కుమారుడు నాగ చైతన్య కూడా నటిస్తోన్నాడు.

'సోగ్గాడే చిన్ని నాయన' సూపర్ డూపర్ హిట్ అవడంతో.. ఆ వెంటనే దానికి ప్రీక్వెల్‌గా 'బంగార్రాజు' ప్రాజెక్టును చేయాలని నాగార్జున డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం ఆ బాధ్యతను దర్శకుడు కల్యాణ్ కృష్ణకు అప్పగించాడు. అంతేకాదు, దీన్ని అక్కినేని హీరోల మల్టీస్టారర్ మూవీగా రూపొందించాలని కూడా చెప్పాడు. చాలా రకాల స్క్రిప్టులు రాసుకున్న తర్వాత అంటే కొద్ది రోజుల క్రితమే దీన్ని అధికారికంగా మొదలు పెట్టేశారు. దీన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని నాగార్జున ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ మొదలైన తర్వాత దీన్ని ఎంతో వేగంగా పూర్తి చేస్తున్నారు.

Akkineni Nagarjuna Tweet about Bangarraju Movie Shooting

తండ్రీ కొడుకుల కాంబినేషన్‌లో సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతున్న 'బంగార్రాజు' మూవీ షూటింగ్ జరుపుకుంటుండగానే దీన్ని సంక్రాంతి కానుకగా తీసుకు వస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. అంతేకాదు, జనవరి 15న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు కూడా క్లారిటీ వచ్చేసింది. కానీ, దీనికి సమయం ఎంతో లేకపోవడంతో అప్పటి కల్లా షూటింగ్ పూర్తి కావడం కష్టమేనని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా 'బంగార్రాజు' మూవీ షూటింగ్‌పై అక్కినేని నాగార్జున అదిరిపోయే ప్రకటన చేశాడు. అంతేకాదు, షూటింగ్ స్పాట్‌లో తీసిన ఓ ఫొటోను సైతం షేర్ చేసి గుడ్‌న్యూస్ చెప్పారు.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'బంగార్రాజు' మూవీ షూటింగ్‌ చివరికి చేరుకుందట. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున స్వయంగా వెల్లడించాడు. 'బంగార్రాజు షూటింగ్‌కు ఇది చివరి రోజు. మరో అదిరిపోయే సాంగ్ రాబోతుంది. పండగ లాంటి సినిమా.. బంగార్రాజు త్వరలోనే రాబోతుంది' అంటూ వెల్లడించాడు. దీనికి నాగ చైతన్య, కృతి శెట్టి మాస్ లుక్‌తో డ్యాన్స్ చేస్తున్న ఓ ఫొటోను కూడా జత చేశాడు. దీంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Akkineni Nagarjuna Tweet about Bangarraju Movie Shooting

భారీ బడ్జెట్‌తో రాబోతున్న 'బంగార్రాజు' మూవీని అక్కినేని స్టూడియోస్ బ్యానర్ సమర్పణలో జీ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.. నాగ చైతన్యకు జోడీగా 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి నటిస్తోన్న విషయం తెలిసిందే. అలాగే, ఇందులో దేవలోకంలో రంభ, ఊర్వశి, మేనకల పాత్రలు కూడా ఉంటాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. వాటిని పలువురు హీరోయిన్లు చేయబోతున్నారట. ఇక, ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు కూడా భారీ స్థాయిలో పెరిగిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X