The Ghost Trailer: నాగార్జున ఊచకోత.. సరికొత్త యాక్షన్ థ్రిల్లర్.. మామూలుగా లేదు!
అక్కినేని నాగార్జున బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని చాలాకాలం అయింది. ముఖ్యంగా సోగ్గాడే చిన్ని నాయనా సినిమా తర్వాత మళ్ళీ అలాంటి రేంజ్ హిట్ రాలేదు. ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే రేంజ్ లో అయితే సక్సెస్ కావడం లేదు. ఇక ప్రస్తుతం ఆయన ది ఘోస్ట్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే గరుడవేగా సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇక సినిమాకు సంబంధించిన ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ట్రైలర్ విషయానికి వస్తే గతంలో ఎప్పుడు లేని విధంగా నాగర్జున ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఒక అమ్మాయిని అలాగే ఆ తల్లిని కాపాడేందుకు గోస్ట్ గా గారికి ఏ విధంగా సెక్యూరిటీ ఇచ్చాడు.. ఒకరికి తెలియకుండా మరొకరిని ఎలా అంతమొందించాడు అనేది సినిమాలో హైలెట్ గా నిలిచే అంశంగా తెలుస్తోంది.
అంతేకాకుండా గ్యాంగ్ స్టార్స్ కిడ్నాపర్స్ మర్డరర్స్ అండర్ వరల్డ్ మొత్తం కూడా టార్గెట్ చేయడంతో బాడీగార్డ్ గా ఉన్న నాగార్జున వాళ్ళందరినీ ఎలా ఎదుర్కొన్నాడు అనేది కూడా సినిమాలో హైలెట్ పాయింట్ గా నిలుస్తుందట. మరోవైపు సోనల్ గ్లామర్ ట్రీట్ కూడా ఈ సినిమాలో హైలెట్ కానున్నట్లు ట్రైలర్లో ప్రజెంట్ చేశారు. ఇక సినిమాలో డైలాగ్స్ కూడా బాగానే ఉన్నాయి. చావును చాలాసార్లు దగ్గరగా చూసాను అంటూ అది ఎన్నటికీ ఆగదు అని నాగార్జున చెప్పిన టైమింగ్ కూడా సినిమా కంటెంట్ కు తగ్గట్టుగా ఉంది.

ఇక సినిమాలో గన్ షాట్స్ పలు యాక్షన్ సన్నివేశాలు విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ది ఘోస్ట్ సినిమా ట్రైలర్ మాత్రం చాలా కొత్తగా ఉంది. అక్కినేని నాగార్జున మొదటిసారి విభిన్నమైన క్యారెక్టర్ తో కనిపిస్తున్నాడు. సీరియస్ లుక్ లోనే థ్రిల్లింగ్ అనిపించేలా ఉంది. ఇక ఈ సినిమాను అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











