నాగార్జున గోవాకి పిలిపించి వార్నింగ్ .. టాప్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
ఒకప్పుడు వరుస సినిమాలు, హిట్స్‌తో టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్ రేసులోకి దూసుకొచ్చారు వి.సముద్ర. టాలీవుడ్ యాంగ్రీ యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా వచ్చిన సింహరాశి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సముద్ర.. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు రాజశేఖర్‌కు తిరుగులేని హిట్ అందించారు. ఈ విజయంతో సముద్రకు అవకాశాలు క్యూకట్టాయి. ఆ తర్వాత శివరామరాజు, టైగర్ హరిశ్చంద్రప్రసాద్, సూర్యం, మహానంది, విజయదశమి, ఏవడైతే నాకెంటీ, అధినేత, పంచాక్షరి, సేవాకుడు తదితర చిత్రాలను తెరకెక్కించారు. కానీ దురదృష్టవశాత్తూ వీటిలో చాలా సినిమాలు డిజాస్టర్ కావడం, యంగ్ టాలెంట్ రాకతో వి.సముద్రని తెలుగునాట పట్టించుకునేవారే కరువయ్యారు.
రేసులో వెనుకబడ్డ వి సముద్ర
తెలుగులో వర్కవుట్ కాకపోవడంతో ఇతర ఇండస్ట్రీలపైనా వి సముద్ర దృష్టి సారించారు. దీనిలో భాగంగా కన్నడంలో దివంగత చిరంజీవి సర్జాగా హీరోగా రణం చిత్రాన్ని తీశారు. దర్శకుడిగానే కాకుండా రెయిన్ బో సినిమాలో నటుడిగానూ కనిపించారు. ఆ తర్వాత ఏ సినిమాకు దర్శకత్వం వహించడం కానీ, నటించడం కానీ చేయలేదు. అలా క్రమంగా సినీ పరిశ్రమకు దూరమయ్యారు వి సముద్ర. ఇటీవల వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆయన తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ పంచాక్షరి సినిమా సమయంలో కింగ్ అక్కినేని నాగార్జునపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సముద్ర.

నా పేరు చెప్పగానే నాగార్జున ఒప్పుకున్నారు
పంచాక్షరి సినిమా డీలే అయ్యిందని వార్తలు వచ్చాయి.. కానీ అది నిజం కాదు. ఆ అమ్మాయి అనుష్క అరుంధతి చేశాక ఎవరికీ చేయలేదు, డేట్స్ ఇవ్వలేదు. చంద్రకి (నాగార్జున పర్సనల్ మేకప్‌మెన్) మాట ఇచ్చింది. చంద్రకు ఇండస్ట్రీలో చాలామంది దర్శకులతో పరిచయాలు ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ బ్యాచ్ మొత్తం పరిచయమే.. కృష్ణవంశీ, పూరీ ఇలా చాలామంది ఉన్నారు. అరేయ్ ఓరేయ్ అనుకునే బ్యాచ్ వీళ్లంతా. నేను నాగార్జున గారి డేట్స్ ట్రై చేసేవాడిని. నాగార్జున గారితో తిరిగేవాడిని, అప్పటికి చంద్రగారితో పరిచయం. ఏది ఉన్నా ఈయనతోనే కలిసేవాళ్లం. నేను డైరెక్టర్ అయ్యాక సినిమాలు చేస్తుండగా.. ఇప్పుడున్న వాళ్లు నా మాట వినరు, సముద్ర అయితే మంచోడు .. మాట వింటాడని నాగార్జున గారికి విషయం చెప్పాడు అని వి సముద్ర తెలిపారు.
నాగార్జున నన్ను గోవాకి పిలిపించి
సముద్ర చాలా మంచోడు.. సముద్రని పెట్టుకోమని చంద్రకి నాగార్జున గారు చెప్పారు. అయితే సముద్రని ఒకసారి నన్ను కలవమను అని చెప్పారట. ఆ సమయంలో నాగార్జున.. కేడీ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఇక్కడికి తీసుకొచ్చేయ్ సముద్రని అని నాగార్జున చెప్పడంతో నేను, చంద్ర కలిసి గోవాలో సెట్‌లో ఆయనను కలిశాం. అప్పుడు నాగార్జున ఒక్కటే అన్నారు.. శ్యాంప్రసాద్ రెడ్డి అరుంధతి తీశాడు.. ఆయన పెద్ద ప్రొడ్యూసర్. ఇక్కడుంది చంద్ర.. నా మేకప్‌మెన్ అంత ప్రొడ్యూసర్ కాదు. వీడి లైఫ్ జాగ్రత్త.. అంత బడ్జెట్ పెట్టించకుండా, ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చేయ్.. ఏదైనా ఇబ్బంది ఉంటే నాతో చెప్పు అని ఈ ఒక్క మాటే చెప్పారు. కథ రెడీ అయ్యాక ఒకసారి చెప్పమని అన్నారు అని వి సముద్ర గుర్తుచేసుకున్నారు.
నాగార్జున అందరినీ సెటిల్ చేశారు
కథ రెడీ అయ్యాక రైటర్ చెబితే నాకొద్దు.. డైరెక్టరే చెప్పాలి నాకు అని నాగార్జున చెప్పడంతో నేనే వెళ్లి కథ చెప్పాను. నేను చెప్పాక ఒకే గో ఎహెడ్ అన్నారు. తన దగ్గర పనిచేసే ప్రతివాళ్లని నాగార్జున గారు చాలా ప్రేమగా చూసుకుంటారు, వాళ్ల ఫ్యామిలీస్‌ని కూడా. ఆయన దగ్గర పనిచేసిన వాళ్లందరినీ సెటిల్ చేశారు. కాస్ట్యూమర్స్‌ని, మేకప్‌మెన్స్‌ని చాలా బాగా చూసుకుంటారు. ఆయన దగ్గర పనిచేసిన వాళ్లంతా 30 ఇయర్స్ అలాగే ఉండిపోతారు. చాలా మంచి మనిషి.. ఎప్పుడూ కూల్‌గా ఉంటారు అని నాగార్జునతో తన అనుబంధాన్ని పంచుకున్నారు వి సముద్ర. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











