బంగార్రాజుగా మారుతున్న నాగార్జున: ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు

ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని హ్యాండ్సమ్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నారు సీనియర్ హీరో అక్కినేని నాగార్జున. ఆయన కొడుకుల కంటే వేగంగా సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన.. ఈ మధ్య కొంచెం నెమ్మదించారు. దీనికితోడు లాక్‌డౌన్ కారణంగా ప్రారంభించాలనుకున్న సినిమాలు కూడా పట్టాలెక్కలేదు. ఇక, ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావంతో తగ్గడంతో షూటింగ్‌లు పున: ప్రారంభం అయ్యాయి. దీంతో అక్కినేని నాగార్జున కూడా స్పీడు పెంచేశారు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు లైన్‌లో పెట్టేస్తున్నారు.

ప్రస్తుతం సోలోమన్ దర్శకత్వంలో 'వైల్డ్ డాగ్' అనే సినిమాను చేస్తున్నాడు నాగార్జున. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఇందులో ఆయన తొలిసారి ఏఎన్ఐ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. దీని తర్వాత అక్కినేని హీరో చేయబోయే సినిమాపై తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. 'వైల్డ్ డాగ్' తర్వాత ఆయన కల్యాణ్ కృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ 'బంగార్రాజు' అనే మూవీ చేయబోతున్నాడట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ మొదటి వారం నుంచి ప్రారంభం కాబోతుందట.

Akkineni Nagarjunas Bangarraju Start From December

సుదీర్ఘమైన కెరీర్‌లో నాగార్జున నటించి మెప్పించిన చిత్రాల్లో 'సోగ్గాడే చిన్ని నాయన' ఒకటి. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. అందుకే అప్పటి నుంచి ఈ సినిమాకు ప్రీక్వెల్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'బంగార్రాజు' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా అవలేదు. అంతేకాదు, ఈ మూవీలో నాగ చైతన్య కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X