నాగార్జున డ్రీమ్ ప్రాజెక్టుపై లేటెస్ట్ అప్‌డేట్: అప్పటి నుంచే పట్టాలెక్కించే అవకాశం

కొంత కాలంగా వరుసగా సినిమాలు చేస్తున్నా.. హిట్‌ను మాత్రం దక్కించుకోలేకపోతున్నాడు కింగ్ అక్కినేనా నాగార్జున. ఈ క్రమంలోనే ఆయన జయాపజయాలను బేరీజు వేయకుండా కొత్త చిత్రాలను మొదలు పెడుతున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది 'వైల్డ్ డాగ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ను అందుకున్నా.. కలెక్షన్లను రాబట్టడంలో మాత్రం విఫలమైంది. అదే సమయంలో నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నాగ్ డ్రీమ్ ప్రాజెక్టు గురించి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది.

నాగార్జున - కల్యాణ్ కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయన'. రెండేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. తద్వారా అక్కినేని హీరో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు ప్రీక్వెల్ తీయాలని నాగ్, కల్యాణ్ ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగానే 'బంగార్రాజు' అనే ప్రాజెక్టుపై వర్క్ మొదలు పెట్టారు. ఎంతో గ్యాప్ తర్వాత ఈ సినిమా వచ్చే జూలై నుంచి ప్రారంభం కాబోతుందని తాజాగా ఓ న్యూస్ తెలిసింది. అప్పటి నుంచి ఏకధాటిగా షూటింగ్ జరపబోతున్నారట.

Akkineni Nagarjunas Bangarraju Start From July

'బంగార్రాజు'లో నాగార్జునతో పాటు మరో హీరో కూడా నటిస్తాడని అంటున్నారు. కానీ, ఈ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ఇక, ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తోంది. మరో హీరోయిన్ భూమిక నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు నాగ్ ఇటీవలే ప్రకటించారు. ఇదిలా ఉండగా.. దీనితో పాటు ప్రవీణ్ సత్తారు రూపొందించే మూవీలోనూ ఈ అక్కినేని హీరో నటించబోతున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X