Manchu Mohan Babu : ‘ మోహన్‌బాబు ఒక పిచ్చోడు ’ .. 17 ఏళ్ల నాటి వీడియో వైరల్

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు ఫ్యామిలీ వివాదం పెను సంచలనం సృష్టించింది. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే ఈ కుటుంబంలోని వ్యక్తుల మధ్య గొడవ చిత్ర పరిశ్రమను , తెలుగువారిని ఉలిక్కిపడేలా చేసింది. మనోజ్ - మోహన్ బాబు కొట్టుకున్నట్లుగా తొలుత వార్తలు రాగా.. వాటిని మంచు ఫ్యామిలీ ఖండించింది. కానీ తర్వాత కొద్దిగంటల్లోనే మెడకు కట్టు, కాలికి గాయంతో మనోజ్ ఆసుపత్రిలో జాయిన్ కావడంతో ఈ కుటుంబంలో ఏదో జరుగుతున్నట్లుగా అనుమానాలు అందరికీ బలపడ్డాయి.

ఇంట్లో వివాదం నేపథ్యంలో దుబాయ్‌లో ఉంటున్న మంచు విష్ణు, ముంబైలో ఉన్న మంచు లక్ష్మీలు హైదరాబాద్ జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు. అయితే మనోజ్, విష్ణులు పోటాపోటీగా బౌన్సర్లను తెప్పించడంతో ఇంట్లో ఏదో జరిగేలా కనిపించింది. ఇదే సమయంలో మనోజ్ అతని సతీమణి మౌనికలను మోహన్ బాబు, విష్ణులు గెంటేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇది మంగళవారం అర్ధరాత్రికి తారాస్థాయికి చేరి హైడ్రామా నడిచింది.

akkineni nageswara rao made sensational comments on Manchu mohan babu at tollywood vajrotsavam

మంచు విష్ణు- మంచు మనోజ్‌ బౌన్సర్ల మధ్య తోపులాట జరగడం.. మనోజ్ బలవంతంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం వంటి ఘటనలు హీటెక్కించాయి. ఇదే సమయంలో ఈ గొడవను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులను అసభ్యపదజాలంతో దూషిస్తూ.. వారిపై దాడి చేయడం వివాదాస్పదమైంది. దీంతో మోహన్ బాబు తమకు క్షమాపణలు చెప్పాలంటూ జర్నలిస్టులంతా అక్కడే ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు తరపున మీడియాకు క్షమాపణలు చెప్పారు మంచు మనోజ్.

ఇదిలాఉండగా.. మోహన్ బాబు అస్వస్థతకు గురికావడంతో ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. హైపర్ టెన్షన్, బీపీతో బాధపడుతున్నారని ఆయన మతిస్థిమితం సరిగా లేదన్నారు. అటు మోహన్ బాబు తరపున హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలవ్వగా.. దీనిపై బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ జరగనుంది.

కాగా.. మంచు ఫ్యామిలీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మోహన్ బాబు గురించి తెలుగు సినీ దిగ్గజం, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు సినిమా 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన వజ్రోత్సవాలలో మోహన్ బాబు లెజెండరీ అనే ఇష్యూని లేపడంతో చిరంజీవి నొచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఏఎన్ఆర్ మాట్లాడుతూ.. మోహన్ బాబు లాంటి హీరోలు ఓ పిక్చర్ సక్సెస్ అయితే మనదే అనుకుంటారని వ్యాఖ్యానించారు.

మోహన్ బాబంటే తనకు చనువని, అతను తన హృదయానికి చాలా ప్రియమైన వాడని.. ఎక్కడైనా ఎవరైనా కనిపిస్తే నమస్కారం అడిగిమరి పెట్టించుకుంటాడని ఏఎన్ఆర్ తెలిపారు. పాపం పిచ్చోడు .. నమస్కారమే కదా, పెట్టేస్తే పోలా అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో గొడవల నేపథ్యంలో అక్కినేని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X