Don't Miss!
- Finance
SBI Result: ఫలితాల్లో దుమ్మురేపిన ఎస్బీఐ.. స్టాక్‌లో ఇక దూకుడేనా..!
- News
తెలంగాణా బీజేపీ పనితీరుపై గ్రౌండ్ రియాలిటీ చెక్ చెయ్యనున్న హైకమాండ్.. కొత్త ప్రయోగం!!
- Sports
INDvsAUS : అశ్విన్ డూప్లికేట్లా బౌలింగ్.. చెమటలు చిందిస్తున్న ఆస్ట్రేలియా టీం!
- Technology
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు .
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బాలయ్య అక్కినేని తొక్కినేని కామెంట్స్ కు అక్కినేని హీరోల కౌంటర్.. పేరు ఎత్తకుండానే షాకింగ్ పంచ్!
నందమూరి బాలకృష్ణ ఇటీవల చేసిన కొన్ని కామెంట్లు ఊహించని విధంగా కాంట్రవర్సీగా మారాయి. అక్కినేని అనే పేరుతో బాలకృష్ణ మాట్లాడిన విధానం ఓ వర్గం అభిమానులను తీవ్రస్థాయిలో అసంతృప్తికి గురి చేసింది. అయితే ఈ విషయంలో అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాలయ్య పై తీవ్ర స్థాయిలో నాగ్రహం కూడా వ్యక్తం చేశారు అయితే ఇప్పుడు అక్కినేని యువ హీరోలు కూడా సోషల్ మీడియాలో స్పందించిన విధానం హాట్ టాపిక్ గా మారిపోయింది ఆ వివరాల్లోకి వెళితే..

వీరసింహారెడ్డి ఈవెంట్ లో బాలయ్య
నందమూరి బాలకృష్ణ ఇటీవల వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ ఈవెంట్లో మాట్లాడిన విధానం హాట్ టాపిక్ గా మారింది. ఆయన సినిమా గురించి చెబుతూ అలాగే తోటి ఆర్టిస్టులతో కూడా మాట్లాడే విధానంపై కూడా స్పందించారు. ముఖ్యంగా సెట్లో ఉండే ఆర్టిస్టులు అందరూ కూడా తనకు ఎంతో టైం పాస్ గా ఉంటారు అని చాలా విషయాల గురించి మాట్లాడుకుంటాము అని ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

అక్కినేని తొక్కినేని అంటూ..
"మా ఆర్టిస్టులు అంత నాకు మంచి టైమ్ పాస్ , వేదాలు శాస్త్రాలు నాన్నగారు ఆ రంగారావు ఈ అక్కినేని తొక్కినేని ఇవన్నీ కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం.. అని నందమూరి బాలకృష్ణ ఊహించని విధంగా ఒక్కసారిగా ఆ మాట అనడంతో అందరూ కూడా షాక్ అయ్యారు. అయితే బాలయ్య ఫ్లోలో అలా అన్నాడా లేక మరేదైనా ఆలోచనతో అలా అన్నాడా? అనే విషయంపై ఆ తర్వాత కూడా ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఫాన్స్ అయితే సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

అక్కినేని హీరోల రియాక్షన్
ఇక అక్కినేని తొక్కినేని అనే మాట మాట్లాడడం పై ఇప్పుడు ఆ ఫ్యామిలీకి చెందిన హీరోలు కూడా సోషల్ మీడియాలో స్పందించిన విధానం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒక విధంగా తెలుగు ఇండస్ట్రీలోని సినీ ప్రముఖుల అందరిని కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిలో ఉంది అని నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా వారు రియాక్ట్ అయ్యారు.

మనల్ని మనమే కించపరుచుకోవటం..
కొద్దిసేపటి క్రితమే అక్కినేని ఫ్యామిలీలోని యువ హీరోలు అక్కినేని అఖిల్ అలాగే అక్కినేని నాగ చైతన్య ఇద్దరు కూడా నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఈ విధంగా వివరణ ఇచ్చారు. "నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్ వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం.." అంటూ వారు వారి సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.

హీరోల ట్వీట్స్ వైరల్
అక్కినేని నాగ చైతన్య అక్కినేని అఖిల్ ఇద్దరు కూడా ఒకేసారి ఆ విధంగా ట్విట్ చేయడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ టాపిక్ మరింత వైరల్ గా మారుతొంది. నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వారు ఆయన పేరు ఎత్తకుండానే ప్రముఖులు అందరినీ కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ అని చెప్పిన విధానం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక నందమూరి బాలకృష్ణ ఈ విషయంపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.