For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    అక్రమ్‌గా టాలీవుడ్ తలైవా.. స్టయిలీష్ గెటప్‌లో హీరో ఎవరంటే..

    |

    రాజధాని అమరావతి మూవీస్ బ్యానర్‌పై అక్ర‌మ్ సురేష్ హీరోగా భారీ మాస్ యాక్ష‌న్ మూవీ చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఓ షెడ్యూల్, 2 పాట‌లు మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. హాలీవుడ్ రేంజ్‌లో తెర‌కెక్కుతున్న చిత్ర‌మిది. హీరో అక్ర‌మ్‌ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రాణా పాత్ర లుక్‌ను సీనియ‌ర్‌ హీరో సుమ‌న్ లాంచ్ చేశారు.

    రామోజీ ఫిలింసిటీలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో స‌మ‌ర్ప‌కుడు విస్సాకోటి, శివ‌కుమార్ ఇత‌ర టీమ్ పాల్గొన్నారు.

    Akram Sureshs Akram First look released

    ద‌ర్శ‌కనిర్మాత‌లు మాట్లాడుతూ-డాన్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రాక్, రాణా, అక్ర‌మ్‌, రాణా ప్ర‌తాప్ సింగ్ అనే నాలుగు గెట‌ప్పుల్లో హీరో న‌టిస్తాడు.నాలుగు స్టైలిష్ గెట‌ప్పుల‌తో ప్రేక్ష‌కుల్ని క‌థానాయ‌కుడు మంత్ర‌ముగ్ధం చేస్తాడు. క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియెన్ .. చిన్నా పెద్దా అంద‌రికీ న‌చ్చే చిత్ర‌మిది. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ తుర్ల‌పాటి అక్కినేనికి న‌ట సామ్రాట్ బిరుదును ఇచ్చారు.

    Akram Sureshs Akram First look released

    తాజా చిత్రంలో అక్ర‌మ్ సురేష్ గెట‌ప్ చూసి టాలీవుడ్ త‌లైవా అనే బిరుదును ఇచ్చారు. భారీ సెట్ లో చిత్రీక‌రించిన ఇంట‌ర్వెల్ సీన్ హైలైట్. 40 సినిమాల అనుభ‌వ‌జ్ఞుడిగా హీరో న‌టించాడు. క‌థానుసారం అద్భుత‌మైన నిర్మాణ విలువ‌ల‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇది మోస్ట్ స్టైలిష్ యాక్ష‌న్ సినిమా.. డాన్ చిత్రాల్లో సినిమాల్లోనే ప్ర‌త్యేకంగా నిలుస్తుంది. అత్యంత ఖ‌రీదైన కార్ల‌ను, దిగుమ‌తి చేసిన బైక్ ల‌ను ఉప‌యోగించారు. త్వ‌ర‌లో రాక్ లుక్‌ని, ఉగాదికి టీజ‌ర్ ని రిలీజ్ చేస్తాం అని అన్నారు.

    Akram Sureshs Akram First look released

    పోసాని, సుమ‌న్, లిపికా త‌దిత‌రులు న‌టించారు. దిల్లీ భామ ఖుషీ క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అవుతోంది. ఈ చిత్రానికి సంగీతం:ఎం.యు.సాయి, ఎడిటింగ్: గౌతం రాజు, కెమెరా: అనీల్, క‌థ‌-క‌థ‌నం-డైలాగ్స్-ద‌ర్శ‌క‌త్వం: సురేష్ మేడిది.

    English summary
    Akram Suresh's Akram First look released. Senior hero Suman released this movies first look. Suresh Medidi is the director. Hero Suresh Akram will be seen in four deferent get ups in this movie.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more