వివాదంలో అక్షయ్ కుమార్.. విచారణకు రావాలని సమన్లు
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ వివాదంలో చిక్కుకున్నాడు. 2015లో జరిగిన మతపరమైన అల్లర్లకు సంబంధించిన కేసులో అక్షయ్ కుమార్‌కు, పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్, డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్‌కు సమన్లు జారీ అయ్యాయి. బాదల్ వర్గానికి, గుర్మిత్ రామ్ రహీం సింగ్ అలియాస్ డేరా బాబాకు మధ్య అక్షయ్ కుమార్ మధ్యవర్తిత్వం జరిపారనే ఆరోపణలపై సమన్లు జారీ చేశారు. ఈ వ్యవహారంలో అక్షయ్‌ని నవంబర్ 21న విచారణకు హాజరుకావాలని పంజాబ్ పోలీసులు ఆదేశించారు.
గత జనవరిలో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. రామ్ రహీం మా పక్క ఇంట్లో దిగాడు అంటూ ట్వింకిల్ ట్వీట్ చేసింది. 2015లో డేరా బాబాను అరెస్ట్ చేసిన సమయంలో పంజాబ్, చంఢీగడ్‌లో మతపరమైన ఘర్షణలు చోటుచేసుకొన్న సంగతి తెలిసిందే.

రామ్ రహీంను కలిశాననే ఆరోపణలను అక్షయ్ కుమార్ ఖండించారు. బాదల్ వర్గాలకు, గుర్మిత్ రామ్ రహీం సింగ్ మధ్య సమావేశం ఏర్పాటు చేశానని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు అని ఓ ప్రకటన అక్షయ్ రిలీజ్ చేశాడు.


Click it and Unblock the Notifications











