అన్నం తిను.. అమ్మను బాధపెట్టకు.. విశాల్‌ ప్రశ్న.. అక్షయ్ కుమార్ జవాబు

Recommended Video

Akshay kumar Talks About Vishal

సూపర్‌స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రానున్న 2.0 చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. వేడుక కోసం చెన్నైలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం కోసం పలువురు ప్రముఖులు తరలివచ్చారు. వేడుక కోసం భారీస్థాయిలో మీడియా హాజరైంది. రజనీకాంత్, అక్షయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ..

శంకర్ డైరెక్టర్ కాదు సైంటిస్ట్

శంకర్ డైరెక్టర్ కాదు సైంటిస్ట్

ఈ వేడుకలో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. శంకర్ జీనియస్ డైరెక్టర్. ఆయన డైరెక్టర్ కాదు.. ఆయన ఓ సైంటిస్ట్. నాకు సినిమాలో పాత్రకు ఎంపిక చేసుకోవడం నాకు గర్వంగా ఉంది. మేకప్ వేసుకోవడానికి 3 గంటలు పట్టేది. షూటింగ్ తర్వాత మేకప్ తీయడానికి గంటన్నర తీసుకొనేది. ఈ సినిమాకు వేసుకొన్నంత మేకప్ నా కెరీర్‌లోనే వేయలేదు. ట్రైలర్ చూస్తే సినిమా ఏంటో తెలుస్తున్నది అని అన్నారు.

మీ ఫిట్‌నెస్ రహస్యం చెప్పండి

మీ ఫిట్‌నెస్ రహస్యం చెప్పండి

ఈ వేడుకలో అక్షయ్ కుమార్‌కు హీరో విశాల్ ఓ ప్రశ్న సంధించారు. మీ ఫిట్‌నెస్ బాగుంది. మీరు ఉదయం 5.30 గంటలకే లేసి జిమ్‌కు వెళ్తారని విన్నాను. ఎంతోకాలంగా ఆ అలవాటును ఎలా కంటిన్యూ చేస్తున్నారు. మీరు నాకు, హీరోలకు స్పూర్తిగా నిలిచారు. మీ ఫిట్‌నెస్ రహస్యం చెప్పండి అంటూ విశాల్ కోరారు.

ప్రతీరోజు సూర్యోదయం చూస్తా

ప్రతీరోజు సూర్యోదయం చూస్తా

నేను తెల్లవారు జామున 5.30 గంటలకు నిద్రలేవను. నేను 4 గంటలకే నిద్రలేచి జిమ్‌కు వెళ్తాను. ఫిట్ నెస్ కోసం సొంతంగా జిమ్ ఏర్పాటు చేసుకొన్నాను. నా జీవితంలో ఇప్పటి వరకు ప్రతీ రోజు సూర్యోదయాన్ని చూశాను. మా నాన్న ఆర్మీలో పనిచేయడం వలన నాకు ఈ క్రమశిక్షణ అబ్బింది అని అక్షయ్ కుమార్ చెప్పారు.

అన్నం తిను.. అమ్మను సంతోషపెట్టు

అన్నం తిను.. అమ్మను సంతోషపెట్టు

విశాల్ ఫిట్‌నెస్ గురించి కూడా నేను విన్నాను. అతడు అన్నం అసలే తినడు అని ఓ ఇంటర్వ్యూలో చదివాను. కేవలం ఇడ్లీ, దోశ మాత్రమే తింటాడట. అన్నం తినకపోవడంపై విశాల్ అమ్మగారు బాధపడుతున్నారని తెలిసింది. అయితే వారంలో ఆదివారం రోజు అన్నం తినాలి. దాంతో మీ అమ్మ సంతోషపడుతుంది అని విశాల్‌కు అక్షయ్ కుమార్ సలహా ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X