బాలీవుడ్ కిలాడితో క్రిష్ మూవీ.. కంగనకు ఝలక్ ఇచ్చేందుకు ప్లాన్
మణికర్ణిక సినిమా విషయంలో నటి కంగన రనౌత్‌తో వివాదం నుంచి బయటపడుతున్న దర్శకుడు క్రిష్ మరో బాలీవుడ్ సినిమాకు దర్శకత్వం వహించేందుకు రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
గతంలో తెలుగులో విజయం సాధించిన టాగూర్ చిత్రాన్ని హిందీలో గబ్బర్ పేరుతో అక్షయ్ కుమార్‌తో ఓ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సినిమా కథను అక్షయ్ కుమార్‌కు చెప్పారని, ఆ కథ పట్ల హీరో సంతృప్తిని కూడా వ్యక్తం చేశాడనే బాలీవుడ్ పత్రిక కథనంలో పేర్కొన్నది.

అక్షయ్ కుమార్ అధికారికంగా ఓకే చెప్పిన తర్వాత క్రిష్ అఫీషియల్‌గా ప్రాజెక్ట్‌ను ఎనౌన్స్ చేస్తారట. ప్రస్తుతం అక్షయ్ కుమార్ కాంచన రీమేక్ లక్ష్మీ బాంబ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
మణికర్ణిక వివాదం కొనసాగుతున్నప్పుడే క్రిష్ రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో క్రిష్ కొంత నిరాశకు గురయ్యారనేది సినీ వర్గాల టాక్. ఎన్టీఆర్ బయోపిక్ ఫ్లాప్ కావడంపై క్రిష్‌ను ఉద్దేశించి కంగన రనౌత్ కొన్ని ఘాటైన కామెంట్లు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో ఓ గట్టి హిట్టు కొట్టి కంగనకు ఝలక్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











