Akshay Kumar కన్నప్పలో అక్షయ్ కుమార్.. ఖిలాడీని మంచు ఫ్యామిలీ వెల్‌కమ్ (వీడియో)
తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాను మంచు ఫ్యామిలీ అట్టహాసంగా రూపొందిస్తున్నది. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో సంచలనాలు క్రియేట్ చేస్తున్నది. అయితే తాజాగా ఈ సినిమాలో ఇండియన్ ఇండస్ట్రీలో టాప్, పాన్ ఇండియన్ యాక్టర్లందరూ భాగమవుతున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టులో ఇండియన్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ చేరడంతో మరింత సెన్సేషన్‌గా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..
కన్నప్ప చిత్రం భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత క్రేజీ ప్రాజెక్టుగా రూపుదిద్దుకొంటున్నది. ఈ చిత్రంలో ప్రభాస్, నయనతార, అనుష్క, ప్రభుదేవా, మోహన్ లాల్ భాగమయ్యారనే వార్తలు మరింత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో తాజాగా అక్షయ్ కుమార్ భాగం కావడంతో ఈ మూవీకి పాన్ ఇండియా లుక్ మరింత పెంచింది. అక్షయ్ నటించడం ద్వారా ఈ సినిమా ఉత్తరాది ప్రేక్షకులకు మరింత చేరువ కానున్నది.

కన్నప్ప చిత్రంలో అక్షయ్ కుమార్ నటిస్తున్నట్టు అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆయన ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి మంచు మోహన్ బాబును కలిసిన వీడియో వైరల్ అయింది. ఆయనను విష్ణు సాదరంగా ఆహ్వానించి.. కన్నప్ప చిత్రంలో భాగం చేశారు. అయితే ఏ పాత్రలో ఆయన నటిస్తున్నారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు.
అక్షయ్ కుమార్ విషయానికి వస్తే.. ఇటీవలే ఆయన బడేమియా చోటే మియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా భారీ కలెక్షన్లను బాక్సాఫీస్ వద్ద రాబడుతున్నది. టైగర్ ష్రాఫ్‌తో కలిసి మల్టీ స్టారర్ చిత్రంలో నటించారు. తాజాగా కన్నప్ప చిత్రంలో చేరడం ద్వారా ఆయన తొలిసారి తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు.
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే రెండో షెడ్యూల్ పూర్తి చేసుకొన్నది. ఈ సినిమా షూట్‌ను న్యూజిలాండ్‌లో ముగించారు. ఈ సినిమాను 2025లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహా భారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











