సూపర్‌స్టార్ కుమార్తెకు వేధింపులు... చిన్న తప్పుతో అలా అతని ట్రాప్‌లోకి..

సోషల్ మీడియా, ఆన్‌లైన్‌లో వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సామాన్యులే కాదు.. ప్రముఖులు కూడా బాధితులుగా మారుతున్నారు. మహిళలు, చిన్నారులపై సైబర్ నేరాలు అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా, నిఘా పెడుతున్నా కేటుగాళ్లకు అడ్డుకట్ట పడటం లేదు. కొత్త కొత్త మార్గాల్లో ఈ వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ సూపర్‌స్టార్ కుమార్తెకు ఆన్‌లైన్‌లో వేధింపులు ఎదురుకావడంతో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్తె నిటారాను వేధింపులకు గురిచేసిన వారిలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు. అసలేం జరిగిందంటే కొద్దినెలల క్రితం ముంబైలోని పోలీస్ కేంద్ర కార్యాలయంలో సైబర్ అవేర్‌నెస్ మంత్ 2025 కార్యక్రమలో అక్షయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితంలో స్వయంగా తన కుటుంబానికే జరిగిన ఘటనను ఏకంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ఉన్నతాధికారుల ముందు బయటపెట్టారు.

Akshay Kumar s Daughter Faces Cyber Harassment one arrested by Maharashtra Police

13 ఏళ్ల తన కుమార్తెకు వీడియో గేమ్స్ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో ఓ రోజున వీడియో గేమ్ ఆడుతుండగా ఓ అపరిచితుడి నుంచి మెసేజ్ వచ్చింది. ఆన్‌లైన్‌లో ఇద్దరూ కలిసి గేమ్ ఆడుతూ ఆమెతో మంచివాడిగా పరిచయం పెంచుకున్నాడు. కొన్నిరోజుల తర్వాత ఓ రోజున మీరు అమ్మాయా? అబ్బాయా? అని మెసేజ్ చేశాడు. నా కుమార్తె పేరు చెప్పగానే అవతలి నుంచి ఓ మెసేజ్ వచ్చింది. నీ నగ్న చిత్రాలను నాకు పంపుతావా అంటూ బెదిరించినట్లుగా మెసేజ్ రావడంతో న కుమార్తె భయంతో వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. ఆపై నేరుగా తన తల్లికి జరిగిన విషయం చెప్పింది. దాంతో తాము సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని అని అక్షయ్ వెల్లడించారు.

పిల్లల చేతిలో మొబైల్ ఉండటం వల్ల వారు కూడా సైబర్ నేరస్తుల ట్రాప్‌లో చిక్కుకోవాల్సి ఉంటుంది. సైబర్ నేరం సాధారణ నేరాల కంటే పెను ప్రమాదంగా మారుతోంది. చిన్నారులను వీటి నుంచి రక్షించుకోవాలంటే బలమైన చర్యలు తీసుకోవాలి. అందుకే పాఠశాల విద్యార్ధులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి, సైబర్ ఎడ్యుకేషన్‌ను ఒక సబ్జెక్ట్‌గా పెట్టాలి. ముఖ్యంగా 7, 8, 9, 10వ తరగతి పిల్లలకు వారానికి ఒకసారైనా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి అక్షయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

అక్షయ్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన మహారాష్ట్ర సైబర్ పోలీసులు.. అక్షయ్‌ కుమార్తెను వేధించిన నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర సైబర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యశస్వి వెల్లడించారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆయన కుమార్తె ధైర్యంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని వారు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం వెల్‌కం టూ ది జంగీల్, హైవాన్, యూనైటెడ్ ఫిల్మ్, గోల్‌మాల్ 5 సినిమాలలో నటిస్తున్నారు అక్షయ్ కుమార్. ఇవి కాకుండా మరిన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి.

Read more about: akshay kumar cyber crime
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X