twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దీపావళికి పేలనున్న లక్ష్మీబాంబ్.. అక్షయ్ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే

    |

    బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, కియారా అద్వానీ నటించిన లక్ష్మీబాంబ్ చిత్రాన్ని మే 22న రిలీజ్ చేయాలని భావించారు కానీ కరోనా లాక్‌డౌన్ కారణంగా విడుదల వాయిదా పడింది. కాంచన చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి లారెన్స్ రాఘవనే దర్శకత్వం వహించారు. అయితే థియేటర్లు ఇప్పట్లో విడుదలయ్యే పరిస్థితులు కనిపించకపోవడంతో అమెజాన్, డిస్నీ+హాట్‌స్టార్, ఇతర ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

    అయితే ఓటీటీలో కూడా రిలీజ్ వాయిదా పడింది. ఓ దశలో ఓటీటీ‌లో రిలీజ్ అవుతుందో లేదో అనే అనుమానాలు తలెత్తాయి. అయితే ఆ ఊహాగానాలకు తెర దించుతూ లక్ష్మీబాంబ్ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాను దీపావళీ కానుకగా అందించాలని నిర్ణయించారు. ఐపీఎల్ టోర్ని ప్రారంభానికి ముందు ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ రెడీ చేశారు.

     Akshay Kumars Laxxmi Bomb set release on November 9th

    లక్ష్మీబాంబ్ సినిమా రిలీజ్‌పై ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేస్తూ.. ఈ సినిమా రిలీజ్ కోసం వేచిచూడాల్సిన అవసరం లేదు. డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ సినిమాను నవంబర్ 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్‌ను ప్రదర్శించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    లక్ష్మీబాంబ్ సినిమా గురించి ఇటీవల అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. చాలా ఏళ్ల క్రితం సినిమాను చూసి చేయాలని నిర్ణయించుకొన్నాను. కానీ ఏవో కారణాల వల్ల చేయడానికి వీలుపడలేదు. చివరికి 2019లో మొదలుపెట్టాం అని తెలిపారు. ఈ చిత్రాన్ని రూ.50 కోట్ల బడ్జెట్‌తో రూపొందించడం గమనార్హం.

    English summary
    Bollywood star Akshay Kumar's Laxmmi Bomb set for diwali release in theatres. As per Taran Adarsh tweet, DIWALI RELEASE... The wait is over... #LaxmmiBomb premieres 9 Nov 2020 on #DisneyPlusHotstar... Stars #AkshayKumar and #KiaraAdvani... Directed by Raghava Lawrence. #Diwali #Diwali2020.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X