7 నెలల్లో 110 కోట్ల ఆస్తుల అమ్మకం .. త్వరలో ఇల్లు కూడా? ఆ హీరోకి ఏమైంది?

చిత్ర పరిశ్రమ విచిత్రమైనది.. ఎప్పుడు? ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇదొక వైకుంఠపాళి అని పెద్దలు అంటూ ఉంటారు. ఎంతో కష్టపడి నిచ్చెన ఎక్కితే.. రెప్పపాటులో పాము నోట్లు పడిపోయి జీవితాలను పొగొట్టుకున్న వారెందరో. ఆస్తులు, ఐశ్వర్యం, పలుకుబడితో వైభవంగా బతికిన వారు చివరి రోజుల్లో పూట గడవటం కష్టమై పేదరికంలోనే జీవితాలను ముగించిన వారెందరో. పాత తరాన్ని చూసిన ఈ తరం నటీనటులు ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. అయితే ఓ హీరో మాత్రం తన ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్ముకోవడం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఎవరా హీరో? ఎందుకు ఆస్తుల్ని అమ్ముకుంటున్నారు? ఈ వివరాల్లోకి వెళితే..

వరుసగా 16 ఫ్లాపులొచ్చినా తగ్గని క్రేజ్
చిత్ర పరిశ్రమ ఎప్పుడూ సక్సెస్ వెంట పరుగులు తీస్తుంటుంది. విజయం సాధించిన వారిని నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది. ఒక్క ఫ్లాప్ పడిందా? ఎంత పెద్ద హీరో అయినాసరే పట్టించుకునే వారే ఉండరు. అలాంటిది ఏకంగా 16 ఫ్లాపులు వచ్చినా చెక్కుచెదరని ఇమేజ్‌తో దూసుకెళ్తున్నారు బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్. ఇన్నేసి ఫ్లాపులు వస్తున్నా సరే ఆయన కెరీర్ మాత్రం తారాజువ్వలా దూసుకెళ్తోంది. ఖచ్చితంగా రెండు, మూడు నెలలకు ఓ సినిమా రిలీజ్ చేస్తూ షాకిస్తున్నారు అక్షయ్ కుమార్. 2020 నుంచి 2024 వరకు నాలుగేళ్ల సమయంలో అక్షయ్ కుమార్ చేసిన 16 సినిమాలు ఫ్లాప్ కావడమే కాక నిర్మాతలకు రూ.వందల కోట్లలో నష్టాలను మిగిల్చాయి

Akshay Kumar sells his properties in Mumbai and Earned Rs 110 Crore In 7 Months

బాలీవుడ్ సూపర్‌స్టార్‌గా
1987లో ఆజ్ అనే మూవీలో ఓ చిన్న పాత్రలో మెరిసిన ఆయన.. తన కష్టంతో ఈ స్థాయికి చేరుకున్నారు. ఖాన్‌లు, కపూర్‌లు, చోప్రాలు, మల్హోత్రాలను దాటుకుని బాలీవుడ్‌లోని అగ్రనటుల్లో ఒకరిగా నిలిచారు. నటుడిగానే కాకుండా డ్యాన్సర్‌గా, ఫైటర్‌గా అక్షయ్ కుమార్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ దిగ్గజం రాజేష్ ఖన్నా కుమార్తె ట్వింకిల్ ఖన్నాను పెళ్లాడారు అక్షయ్. ఈ దంపతులకు ఆరవ్ కుమార్ సంతానం. తీరిక వేళల్లో భార్య, కుమారుడితో కలిసి సరదాగా గడుపుతుంటారు అక్షయ్ కుమార్. ఈ ఏడాది స్కై ఫోర్స్, కేసరి చాప్టర్ 2, హౌస్‌ఫుల్ 5, కన్నప్ప సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన ప్రస్తుతం జాలీ ఎల్ఎల్‌బీ 3, బూత్ బంగ్లా సినిమాలలో నటిస్తున్నారు.

వరుసపెట్టి ఆస్తుల అమ్మకం
ఎక్కడైనా సినీనటుడు తమ సంపాదనతో ఆస్తులు, బంగ్లాలు, ఫాంహౌస్‌లు కొంటారు లేదంటే షేర్లు, వ్యాపారాలలో పెట్టుబడులుగా పెడుతుంటారు. కానీ అక్షయ్ కుమార్ మాత్రం దీనికి భిన్నంగా గడిచిన 7 నెలలుగా తన ఆస్తుల్ని అమ్మేస్తున్నారు. జనవరితో మొదలుపెట్టి నేటి వరకు తన ముంబైలోని తన ఆస్తుల్ని ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నారు. తద్వారా ఇప్పటి వరకు 100 కోట్ల వరకు రాబట్టినట్లుగా బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. అక్షయ్ కుమార్‌కు ముంబైలోని బోరివాలి, వర్లి, లోయర్ పరేల్‌ ఏరియాలలో లగ్జరీ అపార్ట్‌మెంట్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఉండగా వీటిని ఒక్కొక్కటిగా విక్రయించారు.

ఆ ఇల్లు కూడా అమ్మేస్తారా?
ఈ వార్తలు సోషల్ మీడియాలో విస్త్రతంగా చక్కర్లు కావడంతో బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. అక్షయ్ కుమార్‌కు తొలుత కెనడా పౌరసత్వం ఉండేది.. అయితే 2023లో తిరిగి భారతీయ పౌరసత్వం పొందాడు. ఈ నేపథ్యంలో మరోసారి భారత్‌ను వీడి ఫారిన్‌లో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారా అంటూ నెటిజన్లు ఆయనను ప్రశ్నిస్తున్నారు. అయితే ఇన్‌సైడ్ టాక్ ప్రకారం అక్షయ్ కుమార్ రియల్ ఎస్టేట్‌ రంగంలో పెట్టిన తన పెట్టుబడులను ఉపసంహరించుకుని భారీగా లాభాలు పొందుతున్నారట. ఇదే బాటలో ఆయన మరికొన్ని ఇళ్లు, ఆస్తులను కూడా విక్రయించే పనిలో ఉన్నారని గాసిప్స్ వస్తున్నాయి. దీనిపై అక్షయ్ కుమార్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: akshay kumar bollywood news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X