అదరగొట్టిన అక్షయ్ కుమార్.. హౌస్‌ఫుల్4 పోస్టర్లు కేక

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం హౌస్‌ఫుల్4 చిత్రం ఫస్ట్‌లుక్ రిలీజైంది. ఫ్యాన్స్ కోరిక మేరకు స్వయంగా అక్షయ్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా రెండు పోస్టర్లను రిలీజ్ చేశారు. అంతేకాకుండా అభిమానుల కోసం ఓ పోస్టు కూడా పెట్టారు.

1419లోని రాజ్‌కుమార్ బాలాను, 2019కు సంంబంధించిన ఎన్నారై (లండన్ రిటర్న్) హ్యారీ సే‌ను కలుసుకోండి. హౌస్‌ఫుల్4లో వారి జీవన ప్రయాణం ఎలా ఉంటుందో చూడండి. ట్రైలర్ మాత్రం 27న రిలీజ్ అవుతున్నది అని అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. కొద్ది రోజులుగా వీ వాంట్ హౌస్‌ఫుల్ 4 హ్యాష్ ట్యాగ్‌ను అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. దీంతో అక్షయ్ కుమార్ పోస్టరును ట్వీట్ చేయక తప్పలేదు.

Akshay Kumar tweets Housefull 4 posters for Fans

పోస్టర్‌ను పరిశీలిస్తే ఈ చిత్రంలో అక్షయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు స్పష్టమవుతున్నది. ఫ్లాష్ బ్యాక్‌లో రాజ్‌కుమార్ బాలాగా, లేటేస్ట్‌గా ఎన్నారై హ్యారీ రెండు పాత్రల్లో కనిపిస్తున్నట్టు అర్ధమవుతున్నది.
హౌస్‌ఫుల్ 4 చిత్రంలో అక్షయ్ కుమార్, కృతి సనన్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, క‌ృతి కుర్బందా, పూజా హెగ్డే, రానా దగ్గుబాటి, చంకీ పాండే, చంకీ పాండే, జానీ లీవర్ తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే వివాదంలో చెలరేగింది. దర్శకుడు సాజిద్ ఖాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఫర్హాద్ సమ్జీకి బాధ్యతలు అప్పగించారు. ఈ చిత్రం దీపావళీకి రిలీజ్ కానున్నది.

Akshay Kumar tweets Housefull 4 posters for Fans

ప్రస్తుతం అక్షయ్ కుమార్ గుడ్ న్యూస్, లక్ష్మీ బాంబ్ నటిస్తున్నారు. లక్ష్మీబాంబ్ చిత్రం కాంచన సినిమాకు రీమేక్ కావడం గమనార్హం. అలాగే హౌస్‌ఫుల్4 చిత్రం విడుదలకు ముస్తాబవుతున్నది. ఇటీవల ఆయన నటించిన కేసరి, మిషన్ మంగళ్, హౌస్‌ఫుల్4, చిత్రాలు ఘన విజయం సాధించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X