‘అల.. వైకుంఠపురములో’ అరుదైన ఘనత.. వాళ్ల కోసం ప్రపంచంలోనే భారీ థియేటర్‌లో స్పెషల్ షో

By Manoj

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అల.. వైకుంఠపురములో' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి భారీ విజయాలను సొంతం చేసుకున్న చిత్రాలు రావడంతో.. దీనిపైనా ఎన్నో అంచనాలు ఉన్నాయి. సాఫ్ట్ టైటిల్‌తో వస్తుండడం కూడా ఈ సినిమాకు ప్లస్ అవుతోందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో 'వైకుంఠపురములో' మార్కెట్ కూడా భారీగానే పూర్తయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి ఫ్యాన్స్‌లో సంతోషాన్ని నింపుతోంది. ఇంతకీ ఏంటా వార్త..? పూర్తి వివరాల్లోకి వెళితే...

అన్నీ అదిరిపోతున్నాయి

అన్నీ అదిరిపోతున్నాయి

సూపర్ హిట్ కాంబినేషన్ కావడంతో ‘అల.. వైకుంఠపురములో' స్టార్ట్ అయినప్పటి నుంచి క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఈ సినిమాలోని పాటలు, గ్లింప్స్‌కు వస్తున్న ఆదరణే దీనికి ఉదాహరణ. ఈ సినిమా నుంచి విడుదలైన ‘సామజవరగమన' అంటూ సాగే పాట సౌత్ ఇండియా రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

మీరు దిగారు.. నేను ఎక్కాను

మీరు దిగారు.. నేను ఎక్కాను

‘అల.. వైకుంఠపురములో' టీజర్ బుధవారం సాయంత్రం విడుదలైంది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇందులో బన్నీ స్టైల్ ఆకట్టుకుంటోంది. అలాగే, అల్లు అర్జున్ నోటి వెంట వచ్చే త్రివిక్రమ్ డైలాగులు పేలుతున్నాయి. ముఖ్యంగా ‘మీరు కారు దిగారు.. నేను ఇప్పుడు క్యారెక్టర్‌లోకి ఎక్కాను' అని చెప్పే డైలాగ్‌ అదిరిపోయిందనే చెప్పాలి.

‘అల.. వైకుంఠపురములో’ అరుదైన ఘనత

‘అల.. వైకుంఠపురములో’ అరుదైన ఘనత

తాజాగా ‘అల.. వైకుంఠపురములో' గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాను జనవరి 12న ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్‌లో ప్రదర్శించనున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న ఐమాక్స్‌లో ఆరోజు ఉదయం 7.30 గంటలకు ఈ సినిమా స్పెషల్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ థియేటర్‌లో 540 మంది ఒకేసారి సినిమా చూడగలరు.

ప్రభాస్ సినిమా కూడా.. కానీ అది వేరు

ప్రభాస్ సినిమా కూడా.. కానీ అది వేరు

‘సాహో'ను పారిస్‌లోని ప్రపంచంలోనే పెద్దదైన గ్రాండ్‌ రెక్స్‌లో ప్రదర్శించారు. ఈ థియేటర్‌లో ఒకేసారి 2800 మంది కూర్చుని సినిమా చూసే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ తమ సినిమా ప్రదర్శితమవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, ఇక్కడి స్క్రీన్ మాత్రం ఐమాక్స్ కంటే చిన్నది కావడం గమనార్హం.

వైకుంఠపురములో ఏముందంటే..

వైకుంఠపురములో ఏముందంటే..

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో'. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బన్నీ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సుమంత్, టబు, నివేథా పేతురాజ్, నవదీప్, సముద్రఖని తదితర నటులు కనిపించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X