అల.. వైకుంఠపురములో చిక్కులు.. త్రివిక్రమ్‌కి లీగల్ నోటీసులు!!
ఇటీవలే విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన 'అల.. వైకుంఠపువైరములో' మూవీ చిక్కుల్లో పడిందని తెలుస్తోంది. ఈ మూవీ కాపీ అంటూ ఆరోపణలు చేస్తున్నాడు ఓ యువకుడు. మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాపై ఇలాంటి ఆరోపణలు బయటపడటం చిత్రయూనిట్‌ని కలవరపెడుతోంది. ఇంతకీ ఏం జరిగింది? వివరాల్లోకి పోతే..

విడుదలై నెల రోజులు దాటినా.. ఇష్యూ హాట్ టాపిక్
సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలైన అల వైకుంఠపురములో మూవీ సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. విడుదలై నెల రోజులు దాటినా ఇంకా ఆ సినిమా హంగామా కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో 'అల.. వైకుంఠపువైరములో' మూవీ కాపీ అంటూ ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.

త్రివిక్రమ్‌పై సంచలన ఆరోపణలు.. అసలు కథ
వేరే డైరెక్టర్ చెప్పిన కథని తీసుకొని త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అల.. వైకుంఠపువైరములో' మూవీ రూపొందించారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా విషయమై త్రివిక్రమ్‌కి సమస్యలు వచ్చేలా కనిపిస్తున్నాయి. చిన్న సినిమాలకు రచయితగా పని చేస్తున్న కృష్ణ అనే దర్శకుడు త్రివిక్రమ్‌పై సంచలన ఆరోపణలు చేస్తున్నాడు.

నా కథే.. ఫస్ట్ పేజ్ కాపీని త్రివిక్రమ్‌కి ఇచ్చా
తాను 2005లో త్రివిక్రమ్‌ని కలిసి ఇదే స్టోరీని నేరేట్ చేశానని, 2013లో ఈ కథని ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ కూడా చేసుకున్నానని అంటున్నాడు కృష్ణ. తన స్క్రిప్ట్ ఫస్ట్ పేజ్ కాపీని త్రివిక్రమ్‌కి ఇచ్చానని కూడా ఆయన చెబుతున్నాడు. అంతేకాదు తన కథతోనే త్రివిక్రమ్ 'అల.. వైకుంఠపురములో' చిత్రాన్ని తెరకెక్కించాడని ఆరోపిస్తున్నాడు కృష్ణ.

త్రివిక్రమ్‌కి లీగల్ నోటీసులు.. తప్పదు
తాను ఈ కథతో దశ-దిశ అనే టైటిల్‌తో తెరకెక్కించాలని భావిస్తే.. త్రివిక్రమ్ తన కథతో 'అల.. వైకుంఠపురములో' చిత్రం తెరకెక్కించాడని చెప్పాడు కృష్ణ. ఈ మేరకు త్రివిక్రమ్‌కి లీగల్ నోటీసులు కూడా పంపిస్తానని అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు కృష్ణ. దీంతో ఈ ఇష్యూ హాట్ హాట్ చర్చలకు దారితీస్తోంది.

'అల.. వైకుంఠపురములో' మూవీ
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన 'అల.. వైకుంఠపురములో' మూవీ అల్లు అర్జున్ కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచింది. పలు రికార్డులు తిరగరాస్తూ భారీ వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించిన పూజా హెగ్డే కూడా భేష్ అనిపించుకొని వరుస అవకాశాలు పట్టేస్తోంది.


Click it and Unblock the Notifications











